Hyderabad: మీర్ పేట్ లో మిస్ అయిన బాలుడు.. తిరుపతిలో గుర్తింపు..

ఆగస్ట్ 4న హైదరాబాద్ లో మిస్ అయిన బాలుడి ఆచూకీ లభించింది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని డీఎన్ఆర్ కాలనీ చెందిన మహిధర్ రెడ్డి అనే బాలుడు మీర్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఆగస్ట్ 4 శనివారం సాయంత్రం మహీధర్ రెడ్డి ట్యూషన్ కు వెళ్లాడు. ఆ తర్వాత మహీధర్ ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు ట్యూషన్ సెంటర్ కు వెళ్లారు. ట్యూషన్ సెంటర్ వారు బాలుడు ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు.

దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహీధర్ తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు తిరుపతి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చేపట్టారు. మహీధర్ ఆదివారం సాయంత్రం ఓ బైక్ ని లిఫ్ట్ అడిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బాలుడు మీర్ పేట చౌరస్తాలో దిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

The boy who went missing in Hyderabad Mir Peta was found in Tirupati

చౌరస్తాలో మహీధర్ రెడ్డి బస్సు ఎక్కాడు. అక్కడి నుంచి చాదర్ ఘాట్ బస్టాండ్ లో బస్సు దిగినట్లు గుర్తించారు. బాలుడు అక్కడ నుంచి మలక్ పేట రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ రైలు టికెట్ కొనుగోలు చేశారు. మహీధర్ తిరుపతిలో ఉన్నట్లు మంగళవారం ఉదయం పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసుల సహాయంతో బాలుడిని స్టేషన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బాలుడు తిరుపతికి ఎందుకు వెళ్లాడు అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+