Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చినజీయర్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి..! లేదా తరిమేయాలన్న కంచె ఐలయ్య..!!

హైదరాబాద్‌: సాధు సంతువులు, సర్వసంగ పరిత్యాగులు కూడా ఇతరలకు ఆగ్రహం తెప్పించే విధంగా వ్యవరిస్తున్నారు. దేవుడికి ప్రతిరూపాలుగా చెప్పుకునే సాధువులు దేశంలోని కులమతాల గురించి వ్యాఖ్యలు చేయడం పట్ల హేతువాదులు భగ్గుమంటున్నారు. ఇదే కులాల గురించి మాట్లాడిన చిన్న జియర్ స్వామిపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య మండి పడ్డారు. దేశంలో కులాలు, అంతరాలు ఉండాలని ఓ టీవీ చానెల్‌ ఇంటర్వ్యూలో చెప్పిన ఆంధ్ర పీఠాధిపతి చినజీయర్‌ స్వామిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని కంచ ఐలయ్య డిమాండ్‌ చేశారు.

కుల రహిత సమాజాన్ని స్థాపించాలని భారత రాజ్యాంగం చెబుతుంటే, దేశంలో కులాలు, మతాలు ఉండాలని పీఠాధిపతి చినజీయర్‌స్వామి వ్యాఖ్యానించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆచార్య కంచె ఐలయ్య డిమాండ్‌ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు రాజద్రోహం కంటే నేరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీఎస్‌కే, కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో నిన్న సమావేశం జరిగింది.

The case of treason against Chinna Jeeyar swamy.! Or will send away from the country..!!

ఈ సమావేశంలో ఐలయ్య మాట్లాడుతూ వర్ణవ్యవస్థ ఉండాలని చెప్పిన చినజీయరు స్వామిపై చర్యలు తీసుకోకుంటే ఆయన ఆశ్రమం ముందు నిరసన తెలుపుతామని హెచ్చరించారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతను పక్కనపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చినజీయరు స్వామి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేయడం దారుణమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+