వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake IPS: నకిలీ ఐపీఎస్‌ శ్రీనివాస్‌ కేసులో మరో నలుగురికి సీబీఐ నోటీసులు..

|
Google Oneindia TeluguNews

నకిలీ ఐపీఎస్‌ అధికారి శ్రీనివాస్‌ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా హైదరాబాద్ చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు జారీ చేసింది. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. ఈ నలుగురు వ్యాపారవేత్తలను డిసెంబర్ 2న అంటే శుక్రవారం విచారణ హాజరు కావాల్సిందిగా సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న వారిలో యూసఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచు నాయుడు, వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు, సనత్‌నగర్‌కు చెందిన రవి, మరొకరు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఉద్యోగం

ఉద్యోగం

ఢిల్లీ సీబీఐ బ్రాంచ్‌ లో వెంకటేశ్వరరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పగటి పూట లారీలు తిరిగేందుకు అనుమతులు ఇప్పిస్తానని రవి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు విచారణం తేలింది. ఇక సీబీఐ కేసుకు సంబంధించి సెటిల్మెంట్ చేస్తానని చెంచు నాయుడిని నమ్మించినట్లు కూడా కథనాలు వస్తున్నాయి. నకిలీ ఐపీఎస్‌ అధికారి శ్రీనివాస్‌ కేసులో ఇప్పటికే తెలంగాణ పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నోటీసులు ఇచ్చింది.

మంత్రి గంగుల కమలాకర్

మంత్రి గంగుల కమలాకర్


శ్రీనివాస్ తాను సీబీఐ అధికారినంటూ ఇటీవల జరిగిన కాపు సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ తో ఫొటోలు దిగారు. ఈ ఫొటోను గుర్తించిన అధికారులు.. మం త్రి గంగుల సాక్షిగా విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. గురువారం గంగుల కమలాకర్ ఢిల్లీకి వెళ్లి సీబీఐ ముందు హాజరయ్యాడు. గంగులతో పాటు నోటీసులు అందుకున్న ఎంపీ గాయత్రి రవి కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు.

విశాఖ

విశాఖ


నకిలీ ఐపీఎస్‌ అధికారిగా చలామణి అయిన శ్రీనివాస్ విశాఖలో వాల్తేర్ ప్రాంతంలో అపార్ట్మెంట్లో నివాసముంటున్నట్లు గుర్తించారు. ఇక్కడ కూడా వ్యాపార వేత్త పేరుతో మోసాలకు పాల్పడినట్లు సీబీఐ విచారణలో తేలింది. ఆ తర్వాత దేశ రాజధానిలో మకాం వేసి.. గత ఐదేళ్లుగా సీబీఐ అధికారినంటూ దందాలు, సెటిల్‌మెంట్‌ల పేరుతో అనేకమంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది.

English summary
The CBI has issued notices to four Hyderabad-based businessmen in the fake IPS officer Srinivas case. In the CBI notices, it has been mentioned that the inquiry is to be attended on December 2 i.e. Friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X