కాంగ్రెస్ కు కలిసొచ్చిన కేసీఆర్ నిర్ణయం - ఆ "గ్యాప్" తో సీన్ ఛేంజ్..!!

తెలంగాణ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. ఎవరు గెలుస్తారనే అంచనాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. మరో అయిదు రోజుల్లో ప్రచారం ముగియనుంది. బీజేపీ సామాజిక సమీకరణాలు తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. బీఆర్ఎస్ తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ, గ్రౌండ్ రియాల్టీ ఏంటి. ఏం జరుగుతోంది.

హోరా హోరీ పోరు : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలత కనిపిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. క్షేత్ర స్థాయిలో మౌత్ పబ్లిసిటీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు పాజిటివ్ గా కనిపిస్తోంది. కర్ణాటకలో గెలుపు తరువాత తెలంగాణ పైన ఫోకస్ చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం ఏ ఒక్క అవకాశం మిస్ చేసుకోవటానికి సిద్దంగా లేదు.

The Congress is rapidly gaining ground in BRS pockets in Telangana Elections As Reports

అంది వచ్చిన ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలు అమలు చేస్తోంది. ఎన్నికల వేళ అధికారం కాంగ్రెస్ దే అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఇప్పటి వరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ తమ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రసంగానల్లో నాటి పొలిటికల్ పంచ్ లు..ప్రసంగాల్లో ఆ వేడి తగ్గినట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ కలిసొచ్చిందా : కాంగ్రెస్ తొలి నుంచి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ను ట్రాప్ చేసింది. కేసీఆర్ కు గెలుపుపైన ధీమా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ సీట్లు ఇవ్వాలని ఛాలెంజ్ చేసింది. కేసీఆర్ కొందరు మినహా దాదాపు సిట్టింగ్ లకే సీట్లు కేటాయించారు. కొందరు ఎమ్మెల్యేలపైన అప్పటికే వ్యతిరేకత ఉందనే నివేదికలు ఉన్నాయి.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారి పైన కొన్ని నియోజవర్గాల్లో ఉన్న ప్రభావం పరిగణలోకి తీసుకోకుండా వారికి కూడా అప్పటికే ఇచ్చిన హామీ మేరకు సీట్లు ఖరారు చేసారు. ఇప్పుడు ఆ నిర్ణయాలు కాంగ్రెస్ కు కలిసి వస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. అదే సమయంలో కాంగ్రెస్ గ్యారంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన తరువాత వాటి కంటే కొంత మేర పెంచి బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయటం కూడా ప్రజల్లో చర్చకు కారణమైంది.

The Congress is rapidly gaining ground in BRS pockets in Telangana Elections As Reports

క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది : ఇక, ఎన్నికల ముందే ఉద్యోగుల డీఏ, రైతుబంధు నిధులను పూర్తిగా విడుదల చేయటం వంటివి ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం చేయలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. షెడ్యూల్ ప్రకటనకు ముందు కీలకమైన ఆ సమయంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో అందబాటులో లేకపోవటం తో గ్యాప్ వచ్చింది. ఆ సమయాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంది.

కాంగ్రెస్ ఏం చెప్పినా జనం విశ్వసించరు..తాము చేస్తున్న సంక్షేమం - డెవలప్ మెంట్ తమను గెలిపిస్తాయనే విశ్వాసంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు..పబ్లిక్ మూడ్ కు అనుగుణంగా నిర్ణయాలను మార్చుకోవటంలో వెనుకబడి నట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఎన్నికల వ్యూహాల్లో సాటి లేని నేతగా ఉన్న కేసీఆర్ కు ఇప్పుడు కాంగ్రెస్ ధీటుగా ప్రణాళికలు అమలు చేస్తోంది. దీంతో, తమ గెలుపు ఖాయం చేసేలా సీన్ ఛేంజ్ అయిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో..మరి పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ కేసీఆర్ ఏం చేయబోతున్నారు..కాంగ్రెస్ చివరి నిమిషం వ్యూహాలు ఏంటనేది ఆసక్తిగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+