Anjani Kumar: అంజనీ కుమార్‍పై సస్పెన్షన్ ఎత్తివేత..
ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ పై విధించిన సస్పెన్షన్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. అయితే ఆయన డీజీపీగా ఉండగానే సస్పెండ్ అయ్యారు. దీంతో అతని స్థానంలో రవి గుప్తాన్ ఇంఛార్జ్ డీజీపీగా నియమించారు. అంజనీ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయన డీజీపీగా కొనసాగుతారా లేదా అనేది తెలియరాలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న దశలో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు.
ఆయనకు అభినందనలు తెలిపారు. అయితే అంజనీ కుమార్ ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ ఎన్నికలు సంఘం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై ఆయన ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. తాను కావాలని కోడ్ ఉల్లంఘించలేదని.. రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లినట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి తప్పు జరగదని చెప్పారు. దీంతో ఆయన వివరణను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేసింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం డీజీపీ మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డీజీపీ రేసులో రవి గుప్తా, జితేందర్, సీవీ ఆనంద్, రాజీవ్ రతన్ ఉన్నారు. వీరిలో ఒకరికి డీజీపీ పదవి వచ్చే అవకాశం. అయితే అంజనీ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయనే డీజీపీ కొనసాగుతారా లేక మార్చుతారా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications