వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్లపల్లి జైలుకు ప్రియాంక నిందితులు... వాహనంపై చెప్పులు.. రాళ్లు విసిరిన ప్రజలు...!!

|
Google Oneindia TeluguNews

ప్రజల అందోళనల మధ్య డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుండి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో జైలుకు తరలించే సమయంలో అంత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను బయటకు రావడంతో దారి పొడవున ప్రజలు పోలీసు వాహానాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. కొంతమంది యువకులు పోలీస్ వాహానాలకుఅడ్డంగా వెళ్లి పడుకున్నారు. దీంతో సుమారు పది వాహనాలు ఎస్కార్ట్ పెట్టి జైలుకు తరలించారు.

ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్ ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్

Recommended Video

#PriyankaReddy : భగ్గుమన్న మహిళా లోకం.. ఉరి శిక్ష తధ్యమా ? || Oneindia Telugu
 చర్లపల్లి జైలుకు ప్రియాంక నిందితులు

చర్లపల్లి జైలుకు ప్రియాంక నిందితులు

ముఖ్యంగా మూడు కమీషనరేట్‌ల పరిధిలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసినప్పటికి నిందితులను జైలుకు తరలించడం వారికి సవాల్‌గా మారింది. ఈ ఆందోళనలన మధ్యనే వారిని జిల్లా జైలుకు కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే చర్లపల్లి జైలుకు తరలించారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, ప్రజలు పెద్ద ఎత్తున అటు పోలీస్ స్టేషన్ తో పాటు కోర్టుకు కూడ చేరుకున్న పరిస్థితి...మరోవైపు జిల్లా జైలుకు తరలించడం ద్వార కేసు విచారణతో పాటు భద్రత కల్పించడం కూడ ఇబ్బంది కల్గుతుందని భావించిన పోలీసులు చర్లపల్లికి తరలించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఉదయం నుండి షాద్‌నగర్ పీఎస్ వద్ద ఆందోళన

ఉదయం నుండి షాద్‌నగర్ పీఎస్ వద్ద ఆందోళన

ప్రియాంక రెడ్డి హత్యోందం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలోనే అందుకు కారణమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలోనే సమాచారం తెలుసుకున్న ప్రజలు ఉదయం నుండి షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో వేలాది మందిగా స్టేషన్‌ను ముట్టడించారు. నిందితులను చట్టప్రకారం కాకుండా...తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ... స్టేషన్ ముందు బైఠాయించారు.

వైద్యులతోపాటు, జడ్జి సైతం పోలీస్‌స్టేషన్‌కే...

వైద్యులతోపాటు, జడ్జి సైతం పోలీస్‌స్టేషన్‌కే...

దీంతో నిందితులను కనీసం ఆసుపత్రికి గాని , జిల్లా మేజిస్ట్రేట్ వద్దకు గాని తీసుకుపోలేని ఉద్రిక్తత పరిస్థితి నెలకోంది. దీంతో వైద్యులను స్టేషన్‌ను రప్పించి వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం జిల్లా జడ్జి సైతం స్టేషన్‌కే చేరుకున్నారు. మధ్యహ్నం సమయంలో స్టేషన్‌కు చేరుకున్న మేజిస్ట్రేట్ నిందితుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నారు. అనంతరం వారిని ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లా జైలుకు కాకుండా నగరంలోని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే నిందితులు వెళుతున్న వాహనంపై స్థానికులు చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో ఒక్క సారిగా ఉద్రిక్తత నెలకొంది.

English summary
The four who accused in the rape and murder of Dr. Priyanka Reddy have been shifted from Shadnagar police station to Charlapally Central Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X