ధాన్యం ఢిల్లీలో కాకుడా ఫాంహౌస్ లేదా ప్రగతిభవన్ లో పారబొయ్యాలి.!ప్రయణ ఖర్చులు తప్పుతాయన్న పొన్నాల
హైదరాబాద్ : తెలంగాణలో రైతుల పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు కాబట్టి బీజేపి కార్యాలయంలోగాని, ఢిల్లీ లోని ఇండియా గేట్ దగ్గర గానీ పారబొయ్యాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖర్ రావు బాదత్యారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ధాన్యం ఢిల్లీ వరకూ తీసుకెళ్లి ఇండియా గేట్ దగ్గర ఎందుకు పారబొయ్యాలని, ప్రగతి భవన్ లోనో, చంద్రశేఖర్ రావు ఫాం హౌస్ లోనో పారబోస్తే ప్రయాణ ఖర్చులు మిగులుతాయని ఎద్దేవా చేసారు పొన్నాల.

కేసీఆర్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.. మరో రైతు ఉద్యమం తప్పదన్న పొన్నాల లక్ష్మయ్య
కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విదానాలపై టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. గురువారం జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, గడిచిన ఏడేండ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసింది ఏమి లేదని, రైతు వ్యతిరేక ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని పొన్నాల పిలుపునిచ్చారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యిందని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని మండి పడ్డారు.

రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. లేదంటే పోరాటం తప్పదన్న పొన్నాల
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్షం మూలాన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పొన్నాల ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో వరిధాన్యం పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు బాధ్యతను ఒకరి మీద ఒకరు నెపం మోపుకుని రైతాంగాన్ని పట్టించుకోక పోవడంతో రైతుల పరిస్థితి ఘోరంగా తయారయ్యిందని మండి పడ్డారు. తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పొన్నాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

కేంద్రం రాష్ట్రం రైతాంగాన్ని కక్షకట్టాయి.. మొండి వైఖరి ఎందుకన్న పొన్నాల
కేంద్ర ప్రభుత్యం 5.5 లక్షల కోట్ల రూపాయలను బడా వ్యాపారస్తులకు రద్దు చేసిందని, 9 లక్షల కోట్ల రూపాయలను ఎన్పీయే కింద పెట్టిందని, రాష్ట్ర ప్రభుత్వమే రైతుబంధు పథకం ద్వారా భుస్వాములకి 14,300 కోట్ల రూపాయలను ఇస్తోందని వివరించారు. ముదనష్టపు ప్రభుత్వం లిక్కర్ టెండర్లలో 12వేల కోట్ల రూపాయల లబ్ధి పొందుతోందని, రైతుల కోసం 19600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా అని ప్రశ్నించారు. భుస్వాములకు వేల కోట్లు దోచిపెడుతున్న ప్రభుత్యం పంట పండించిన రైతుల వద్ద పూర్తిగా కొనుగోలు చేసిన కూడా ఎలాంటి ఆర్దిక భారం పడదని పొన్నాల వివరించారు. ఈ మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఎలా అని పొన్నాల ప్రశ్నించారు.

మోదీ,కేసీఆర్ లకు రోజులు దగ్గర పడ్డాయి, రైతులు గుణపాఠం చెప్తారన్న పొన్నాల లక్ష్మయ్య
చంద్రశేఖర్ రావు ఢిల్లీకి రైతులను, వరి ధాన్యాన్ని విమానాల్లో తీసుకెళ్లలేడు కాబట్టి ముఖ్యమంత్రి ప్రగతి భవన్లోనో, చంద్రశేఖర్ రావు ఫాం హౌస్ లోనో ధాన్యాన్ని డంప్ చేయాలని, గతంలో తెలంగాణ ఉద్యమంలో తోండికి దిగుతూ, మొండిగా వ్యవహరిస్తూ, గజిబిజి చేస్తూ, గారడి చేస్తున్నారని చంద్రశేఖర్ రావు పాట కూడా పాడారని, ఇప్పుడు రైతుల విషయంలో చంద్రశేఖర్ రావు చేస్తున్న పని కూడా అలాగే ఉందని, చంద్రశేఖర్ రావు, మోదీలని గద్దె దించడానికి మరో ఉద్యమం చేపట్టాల్సిన పరిస్ధితులు తలెత్తాయని మండి పడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయక పోతే మరో రైతు ఉద్యమం తప్పదని పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications