High Court On Constable Jobs: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన హైకోర్టు..

పరీక్షలు రాసి ఉద్యోగానికి ఎంపికైన కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు హైకోర్టు శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంభందించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. కానిస్టేబుల్ నియామక ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో 15 వేల 640 మంది అభ్యర్థుల ఉద్యోగాలు కానిస్టేబుళ్లుగా మారనున్నారు.

Recommended Video

    Constable ఉద్యోగ నియామకంపై కీలక తీర్పు ఇచ్చిన హైకోర్టు | Telugu Oneindia

    కొన్ని నెలలుగా నిరీక్షిస్తున్న అభ్యర్థులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కానిస్టేబుల్ ఫలితాల అనంతరం కొంత మంది అభ్యర్థులు నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ నాలుగు మార్కులు కలపాలని తీర్పు నిచ్చింది. దీంతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ నిలిచిపోయింది.

     The High Court made it clear that the constable recruitment process should continue

    అయితే కానిస్టేబుళ్లకు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టు సింగల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లారు. దీనిపై విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది. ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

    నెల రోజుల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి టిఎస్‌ఎల్‌పిఆర్‌బి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ప్లిమినరీ, ఈవెంట్స్, మెయిన్స్ రాసిన తర్వాత ఫలితాలు విడుదల చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+