Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో బీజేపి,కాంగ్రెస్ ఆశలు నెరవేరవు.!మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్.!

హైదరాబాద్ : శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. శాసన మండలి పదవిని ధర్మబద్ధంగా నిర్వహిస్తున్నానన్నారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి అనేక రాజకీయ అంశాలను ప్రస్తావించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. రాజ్యాంగ చట్టాలను అనుసరిస్తూ, న్యాయ బద్దంగా చైర్మన్, స్పీకర్ స్థానాలకు న్యాయం చేస్తున్నామన్నారు.

బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పైన, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పైన చేసిన వాక్యాలు అర్ధరహితమన్నారు గుత్తా. బండి సంజయ్ తీరు చూస్తే గురివింద గింజ సామెతను గుర్తు చేస్తుందన్నారు. తన గురించి మాట్లాడే నైతిక హక్కు బండి సంజయ్ కు లేదన్నారు.

The hopes of BJP and Congress will not be fulfilled in Telangana!Council Chairman Gutta Sensational Comments!

గవర్నర్ పదవి కూడా రాజకీయ వ్యవస్థలో భాగం కాదు: గవర్నర్ పదవి కూడా రాజకీయ వ్యవస్థలో భాగం కాదని, గవర్నర్ పదవీ లో ఉన్నవాళ్లు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సహా చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు పొలిటికల్ గా వ్యవహరిస్తున్నారని, దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు గుత్తా.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందారన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఘోరంగా విఫలమయ్యారని గుత్తా మండి పడ్డారు.

రేవంత్ ఆరాటం సీఎం అయ్యేందుకే: ప్రజాసమస్యలపై మాట్లాడకుండా నిత్యం ప్రజల నడుమ విద్వేషాలు పెంచుతూ రాజకీయంగా లబ్ది పొందాలని బీజేపీ పార్టీ నేతలు చూస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు అధికారంలోకి వస్తే పాలన అంతా ఢిల్లీ నుండి జరుగుతుందన్నారు. వాళ్లు పార్టీ కార్యవర్గం వేయాలన్నా ఢీల్లీ పెద్దల నిర్ణయం కోసం వేచి చూడలని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనన్నారు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నాడని, తెలంగాణను దోచుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నాడని అన్నారు. ప్రియాంకా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా పార్టీ నేతలను ఏకం చేయడానికే తప్ప ప్రజలకు ఓరిగేది ఏమిలేదన్నారు గుత్తా.

ప్రధానికి విజ్ఞత లేదు: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి తెలంగాణలో అస్సలు లేదన్నారు గుత్తా. తక్కెడలో కప్పల లాగా రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి కర్నాటక ఎన్నికల్లో మాట్లాడుతున్నారని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల సభలో ప్రధాని మత నినాదాలు చేస్తున్నారన్నారు గుత్తా. కర్నాటకలో లౌకిక శక్తులు విజయం సాదించాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+