Weather Update: తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు..
తెలంగాణలో ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంది. అయితే రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు వానలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ద్రోణి కారణంగా వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొసాగుతోందని తెలిపింది.
దీని ప్రభావంతో ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వానలు పడనున్నాయి. వర్షానికి ముందు, వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, భువనగిరి, రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 19 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటికీ తగినంత వర్షపాతం నమోదు కాలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications