వీణ వాయించిన మంత్రి .. చాలా టాలెంట్ ఉందని ఆశ్చర్యపోయిన వీక్షకులు
తెలంగాణ మంత్రులకు చాలా టాలెంట్ ఉంది. అది సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. వారికి కళల పట్ల అభిమానమే కాదు. వారిలోనూ గొప్ప కళాకారులు ఉన్నారు. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన టాలెంట్ ను ప్రదర్శించారు. దీంతో అక్కడికి వచ్చిన వీక్షకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ టాలెంట్ కు ఆశ్చర్యచకితులయ్యారు. అసలింతకీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏం చేసారంటే..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో 'గాంధీ వాదం విపంచి నాదం' అనే పేరుతో వీణా వాద్య కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీణ వాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శాస్త్రీయ సంగీతానికి ఉపయోగించే వాద్య పరికరాలను వీణ కు ఒక ప్రశస్తమైన స్థానం ఉంది. వీణా వాదన చేయడం అంత సులభమైన పని కాదు. అందులోనూ వీణ వాద్యంలో ఆరితేరిన కళాకారుల ముందు అంత ఈజీ కాదు. అలాంటిది మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీణా వాదన కచేరీలో వీణ వాయించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.

ఇక ఈ కచేరీలో 116 మంది కళాకారులు పాల్గొన్నారు. మంత్రి వీణ వాయించడంతో కళాకారులు మరింత ఉత్సాహంతో వీణా వాదన చేశారు. గాంధీ జయంతి వేడుకలు ఒకపక్క, బతుకమ్మ సంబరాలు ఇంకొక పక్క జరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గాంధీ మార్గం అనుసరణీయం అన్నారు. అలాగే పూలను పూజించే సంస్కృతి తెలంగాణకు మాత్రమే సొంతమని చెప్పారు. తెలంగాణలో కళలు విరాజిల్లుతున్నాయని తెలిపారు. తెలంగాణ కళలకు కాణాచి అన్న మంత్రి తనలో ఉన్న కళాకారుడిని సైతం ఈ కార్యక్రమం ద్వారా చూపించారు.












Click it and Unblock the Notifications