ఆ మంత్రిగారికి ప్రభుత్వానికి , పార్టీకీ తేడా తెలియదా ..? సంచలనాల మల్లన్న మరో నిర్వాకం

ఆ మంత్రివర్యుల కు పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియదా అంటే తెలియదని టక్కున చెప్పొచ్చు. అదేంటి అంటారా? ఆ మంత్రివర్యులు చాలా ప్రత్యేకం. తన మాటలతో ఎప్పుడు వివాదాలను సృష్టించే మంత్రివర్యులు మల్లారెడ్డికి పార్టీనే ప్రభుత్వం, ప్రభుత్వం అంటేనే పార్టీ .. అందుకేనేమో ఆయన ఇప్పుడు ఒక ఘనకార్యం చేశారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

మల్లారెడ్డి అధికారిక లెటర్ హెడ్ మీద పార్టీ పదవి ఉత్తర్వులు ఇచ్చినట్టు చెప్తున్న లెటర్ సోషల్ మీడియాలో వైరల్

మల్లారెడ్డి అధికారిక లెటర్ హెడ్ మీద పార్టీ పదవి ఉత్తర్వులు ఇచ్చినట్టు చెప్తున్న లెటర్ సోషల్ మీడియాలో వైరల్

అధికారిక వ్యవహారాలకు వినియోగించాల్సిన లెటర్‌హెడ్‌ను మంత్రి మల్లారెడ్డి.. టీఆర్‌ఎస్‌ పార్టీ కి చెందిన మండలాధ్యక్ష పదవి నియామక ఉత్తర్వుల కోసం ఉపయోగించడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. కీసరకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు జలాల్‌పురం సుధాకర్‌ రెడ్డిని ఆ మండల పార్టీ అధ్యక్షుడిగా మల్లారెడ్డి నియమించారు. ఆ విషయాన్ని ‘అపాయింట్‌మెంట్‌ లెటర్‌' అని మల్లారెడ్డి తన అధికారిక లెటర్‌హెడ్‌పై ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనే స్వయంగా సంతకం కూడా చేశారు. ఆ లెటర్‌హెడ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 ఆయన ఏది చేసినా షాక్ అవ్వాల్సిందే .. అందులో భాగమే ఈ ఘనకార్యం

ఆయన ఏది చేసినా షాక్ అవ్వాల్సిందే .. అందులో భాగమే ఈ ఘనకార్యం

ఎప్పుడు వివాదాస్పదం అయినటువంటి విషయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మంత్రి మల్లారెడ్డి చాలా సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గతంలో భూకబ్జాలు గురించి మాట్లాడుతూ భూములు కబ్జా చేసే వాళ్లంతా మా పార్టీలోనే ఉన్నారంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇక మొన్నటికి మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందు చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పేరును మంత్రి మల్లారెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇక తాజాగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవి నియామక ఉత్తర్వులను అధికారిక లెటర్ హెడ్ మీద ఇచ్చి మరోమారు మంత్రి మల్లారెడ్డి వివాదం లో నిలిచారు.

పార్టీ లెటర్ హెడ్ కి అధికారిక లెటర్ హెడ్ కి తేడా తెలీని మంత్రి అని నెటిజన్లు సెటైర్లు

పార్టీ లెటర్ హెడ్ కి అధికారిక లెటర్ హెడ్ కి తేడా తెలీని మంత్రి అని నెటిజన్లు సెటైర్లు

టిఆర్ఎస్ పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా అన్ని నిర్ణయాలూ కెసిఆర్ గానీ , కేటీఆర్ గాని తీసుకుంటారు. కానీ మంత్రి మల్లారెడ్డి తానే స్వయంగా నిర్ణయం తీసుకొని ఏకంగా అధికారిక లెటర్ హెడ్ మీద తన సంతకం చేసి మరీ మండల అధ్యక్ష పదవిని ఇచ్చారంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఏది ఏమైనా మంత్రి చేసిన నిర్వాకంతో పార్టీ లెటర్ హెడ్ కి, అధికారిక లెటర్ హెడ్ కి తేడా తెలియని మంత్రి... ఈయన ఏ మంత్రి రా బాబు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న మంత్రి మల్లారెడ్డి నిర్వాకంపై గులాబీ బాస్ కెసిఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా స్పందిస్తారో మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+