Vegetable Price: భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. ఆందోళనలో సామాన్యులు..

రాష్ట్రంలో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. టమాటా మినహా మిగతా కూరగాయలన్నీ పెరిగిపోయాయి. ఒకప్పుడు వంద రూపాయలకు ఐదు రకాల కూరగాయలను కొనుగోలు చేసేవారు కానీ ఇప్పుడు అదే వంద రూపాయలకు అసలు కూరగాయలు రావడం లేదని చెబుతున్నారు. ఇక చిక్కుడు కాయలైతే చికెన్ ధరతో పోటీ పడుతోంది. సాధారణంగా ఈ సమయంలో చిక్కుడు కాయ ధరలు తగ్గాలి. ఇప్పుడు చిక్కుడు కాయ సీజన్ అయినప్పటికీ ధరలు భారీగా పెరుగుతోన్నాయి. ఆలుగడ్డ కిలో రూ.40 పలుకుతోంది.

పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పప్పులతో కాలం గడుపుదామంటే వాటి ధర కూడ భారీగా పెరిగిపోయాయి. పెసర, కంది, మినప పప్పులు ఎప్పుడో సెంచరీ దాటేశాయి. పోని కోడి గుడ్లు వండుకుందామనుకుంటే.. వాటి ధర కూడా భారీగా పెరిగాయి. ఒక్కో ఎగ్ ధర రూ.7 లకు చేరింది. దీంతో నాలుగు గుడ్లు కొనేవైరు రెండు గుడ్లతోనే సరిపెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు ఉల్లి ధరలు కూడా ఇబ్బందలు పెట్టాయి. కానీ ఇప్పుడు ఉల్లి ధరలు తగ్గాయి. కిలో ఉల్లి రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది.

The prices of vegetables in the state increased drastically in the state

వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెల్లుల్లి రూ. 350 నుంచి రూ.380 వరకు పలుకుతోంది. అటు టిఫిన్లలో చెక్ని కోసం, అలాగే వివిధ వంటల్లో వాడే పల్లీల ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో పల్లీ ధరలు రూ.150 పలుకుతోంది. వెజ్​ అండ్​ నాన్​ వెజ్​ మార్కెట్లలోనూ రేట్లు గత నెలతో పోలిస్తే 70 నుంచి 100 శాతం పెరిగాయి. ​ ఖమ్మం జిల్లాలో కూరగాయల రేట్లు పెరగడానికి ఇటీవల వచ్చిన మౌచింగ్ తుఫానే ప్రధాన కారణమని చెబుతున్నారు.

ఇటు బియ్యం ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరలను అదుపు చేయడానికి బాస్మయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. అలాగే పప్పుల దిగుమతి సుంకం తగ్గిపును పొడిగించింది. ధరలు పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల్లో రాయితీ పై పంపులు అందించాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+