వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతి ప్రేమ-విషాదం: ‘పక్కా ప్లాన్ నరేశ్‌ను ఎక్కడో చంపేశారు, అన్నీ కట్టుకథలే’

|
Google Oneindia TeluguNews

యాదాద్రి: ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ హత్య, స్వాతి ఆత్మహత్యలపై ఇప్పటికీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్న నరేష్‌ను స్వాతి తండ్రి శ్రీనివా‌సరెడ్డి, తదితరులు ఎక్కడో చంపి మాయం చేశారని ప్రజా, పౌరసంఘాల నిజనిర్ధారణ కమిటీ మంగళవారం అభిప్రాయ పడింది.

<strong>'అలా బతికేవారు': అదే పట్టించింది, నరేష్-స్వాతి మధ్య విభేదాలనే....</strong>'అలా బతికేవారు': అదే పట్టించింది, నరేష్-స్వాతి మధ్య విభేదాలనే....

నరేశ్‌ను దహనం చేసినట్టు చెబుతున్న స్థలంలో, కాల్చివేసినట్టు ఎటువంటి ఆనవాళ్లు లేవని గ్రామస్తులు చెబుతున్నారని.. దీంతో నరేష్‌ను ఎక్కడో చంపి మాయం చేసి.. కేసు పక్కదారి పట్టించడానికి కట్టుకథలు చెబుతున్నారని అభిప్రాయపడ్డారు.

నరేష్, స్వాతి

నరేష్, స్వాతి

నరేష్‌ హత్య, స్వాతి అనుమానాస్పద ఆత్మహత్య ఘటనలపై మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ప్రజా, పౌరసంఘాల ప్రతినిధులు నరేష్‌ స్వగ్రామం పల్లెర్ల, స్వాతి స్వగ్రామం లింగరాజుపల్లి గ్రామాలను సందర్శించారు.

ఎలా చంపారు

ఎలా చంపారు

సీనియర్‌ పాత్రికేయులు పాశం యాదగిరి, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు జాన్ వెస్లీ, భూపతి వెంకటేశ్వర్లు, ఎస్‌ రమతో పాటు 25 సంఘాలకు చెందిన ప్రతినిధులు స్వాతి ఆత్మహత్య చేసుకున్న ఇంటిలోని బాతరూమ్‌ను, నరేష్‌ను దహనం చేసిన స్థలాలను పరిశీలించారు.

స్వాతినీ హత్య చేసివుంటాడు

స్వాతినీ హత్య చేసివుంటాడు

అనంతరం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. నరేష్‌- స్వాతి హత్యలు కుల దురహంకారంతో చేసిన పాశవిక హత్యలుగా అభివర్ణించారు. స్వాతిని సైతం ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి హత్య చేసి ఉంటాడన్నారు.

కఠిన చర్యలు తీసుకోకుంటే..

కఠిన చర్యలు తీసుకోకుంటే..

ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు వాస్తవాలు బయటకు తీయడానికి ఖచ్చితమైన విచారణ చేయలేదన్నారు. నరేష్ హత్య, స్వాతి ఆత్మహత్యల వ్యవహారంలో పూర్తి వైఫల్యం పోలీసులదేనని, వారిపై హత్యా నేరం కేసులు నమోదు చేయాలని సీనియర్ జర్నలిస్టు, కమిటీ సభ్యులు పాశం యాదగిరి అన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి మూడు మాసాల్లో ఈ కేసులో నిందితులను గుర్తించి కఠినమైన శిక్షలు పడకపోతే చలో భువనగిరి కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జూన్ 4న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరసన సభ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు యాదగిరి, ఐద్వా రాష్ట్ర కిమటీ సభ్యురాలు మల్లు లక్ష్మి తెలిపారు.

 పథకం ప్రకారమే హత్య.. రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి..

పథకం ప్రకారమే హత్య.. రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి..

పథకం ప్రకారమే నరేష్, స్వాతిల హత్యలు జరిగాయని, ఆధారాలు లభించకుండా నిందితులకు పోలీసులు సహకరించారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌర సామాజిక సంఘాల నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పాశం యాదగిరి, జాన్ వెస్లీ, భూపతి వెంకటేశ్వర్లు, పైళ్ల ఆశయ్య, ఆశలత, కూరపాటి రమేష్‌లు నరేష్ తల్లిదండ్రులు అంబోజు వెంకటయ్య, ఇందిరమ్మ, సోదరి నీలిమలను పరామర్శించారు. నరేష్-స్వాతి ప్రేమ వివాహం, పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. హత్యకు గురైన నరేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ.25లక్షలు ఎక్స్ గ్రేైసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికీ కలెక్టర్ స్పందించకపోవడంపై విచారకరమని, ఎంతటివారినైనా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి అన్నారు.

English summary
The public, citizen groups working committee responded on naresh murder case issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X