వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిద్దుబాట: అనిశెట్టి మురళి హత్య కేసుపై సర్కారు నష్ట నివారణ చర్య

టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని, ఈ విషయంలో తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని వరంగల్ పోలీసు కమిషనర్ జీ సుధీర్‌బాబు వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని, ఈ విషయంలో తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని వరంగల్ పోలీసు కమిషనర్ జీ సుధీర్‌బాబు వెల్లడించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇది రాజకీయంగా జరిగిన హత్య కాదని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా హత్యకు దారితీసిందని అన్నారు. హత్యల విషయంలో బయటివారి ప్రమేయం తో కేసులు నమోదు చేసే ఉద్దేశం పోలీసులకు లేదన్నారు. కార్పొరేటర్ మురళి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసు స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయిన నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.

the reason for the murder of TRS corporator Anisetti Murali at warnagal of Telangana

అనంతరం పోలీసులు జరిపిన విచారణలో ప్రధాన నిందితుడు విక్రం ఓ వ్యక్తిని కలవగా ఆ వ్యక్తి మరో వ్య క్తిని కలిసినట్లయితే మారణాయుధాలు సమకూర్చగలడని చెప్పాడన్నారు. ఈ విషయాన్ని ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు రిమాండ్ సీడీలో పొందుపర్చి కోర్టు వారికి తెలిపామన్నారు.

ఏ-4, ఏ-5, ఏ-6 నింది తులుగా పేర్కొనబడిన వ్యక్తుల వివరాలను అదే రోజు పోలీసులు వెల్లడించే వారని, కానీ శాంతిభద్రతలను అదుపు చేసే క్రమంలో పేర్లను వెల్లడించలేక పోయామని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఏ-4ను రెండు సార్లు కలిసినట్లుగా విచారణలో తెలిపాడన్నారు. నేరస్తులు కాని వారిని ఎట్టి పరిస్థితుల్లో కేసుల్లోకి లాగి వారి భవిష్యత్తును దెబ్బతీయలేమని తెలిపారు.

మురళి హత్య కేసును పూర్తిగా శాస్త్రీయ కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడి ఆధారంగానే నిబంధనల మేరకు కేసును నమోదు చేశామని, సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే ఏ-4, ఏ-5, ఏ-6లను అరెస్టు చేస్తామన్నారు. ఇప్పటి వరకు వారు నేరస్తులని పోలీసులు ఎక్కడా ప్రకటించ లేదని పేర్కొన్నారు. విచారణలో నేరస్తులెంతటి వారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ డీసీపీ వేణుగోపాల్‌రావు, హన్మ కొండ ఏసీపీ మురళీధర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఒత్తిడి పెంచిన కాంగ్రెస్‌...

రాష్ట్రంలోని అన్ని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షు హైదరాబాద్‌ కాంగ్రెస్‌ భవన్‌లో ఇటీవ విలేకరు సమావేశం ఏర్పాటు చేసి వరంగల్‌ పోలీసు వైఖరిని ఖండించారు. స్వయంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగి డీజీపీ అనురాగ్‌ శర్మను కలిసి, కాంగ్రెస్‌ నాయకుపై అక్రమ కేసును ఉపసంహరించుకోవాని కోరారు.

ఆ వెంటనే సీపీ సుధార్‌బాఉ విలేకరు సమావేశం ఏర్పాటుచేసి, రిమాండ్‌ రిపోర్టులో పేర్లున్న కాంగ్రెస్‌ నేతు నాయని రాజేందర్‌రెడ్డి, కానుగంటి శేఖర్‌, పోతు శ్రీమాన్‌ను ఆధారాలు దొరికితేనే అరెస్టు చేస్తామంటూ ప్రకటించారు. మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖాధికారు ద్వారా దిద్దుబాటు చర్యకు పూనుకున్నట్లు కనిపిస్తోంది.

English summary
Warangal police Commissioner Sudhir Bbau said that personal enimity was the reason for the murder of TRS corporator Anisetti Murali at warnagal of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X