పాలన పూర్తి అస్తవ్యస్ధం.!కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకేనా.?అఖిలపక్ష నేతల అసహనం.!

హైదరాబాద్: జాతీయ రాజకీయాల మీద దృష్టిని కేంద్రీకరించి, సొంత రాష్ట్రంలో పరిపాలన మీద సీఏం చంద్రశేఖర్ రావు పట్టు కోల్పోయారని‌, అందుకే రాష్ట్రంలో పేపర్ల లీకేజీ అనేది ఒక ట్రెండ్ గా మారిపోయిందని అఖిలపక్ష పార్టీల‌ నాయకులు అభిప్రాయపడ్డారు. బుధవారం టీజేఏస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రతరం అవుతున్న నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ, పేపర్ల లీకేజీ, పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల మీద భవిష్యత్తు కార్యాచరణ గురించి సమగ్రంగా చర్చ జరిగింది. అఖిలపక్ష పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు అందరూ ఒకే వేదిక మీదికి వచ్చి ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.

The regime is incomplete disarray. The impatience of all party leaders.!

దీని‌ కోసం "టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ" అనే వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా త్వరలోనే నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో పోరాటాన్ని తీవ్రతరం చేయాలని సమావేశంలో అఖిల పక్ష నేతలు నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ సిధ్ధం చేయడం జరిగిందని కూడా తెలిపారు.

గురువారం 6వ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే విలేకరుల సమావేశంలో కమిటీ తరపున అఖిలపక్ష నాయకులు పూర్తి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు అఖిల పక్ష నేతలు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, టీజేఏస్ పార్టీ అధ్యక్షులు ప్రొ. కోదండరాం, తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ బచావో ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి, సీపీఐ ఎమ్ఎల్ ప్రజాపంథా రాష్ట్ర సెక్రటరి సభ్యురాలు రమాదేవి, సీపీఐ ఎమ్ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటరి సభ్యులు జేవీ చలపతి రావు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ కన్నెగంటి రవి, తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ సుధాకర్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, టీజేఏస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+