రెవెన్యూ ఉద్యోగుల ఉద్యమ బాట..! కొంపముంచనున్న సీఎం ప్రకటన..!!
హైదరాబాద్: రెవెన్యూశాఖ మార్పుపై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే ఉద్యమం ఉధృతం చేయాలని రెవెన్యూ ఉద్యోగుల నిర్ణయం తీసుకున్నారు. టీజీటీఏ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల సమావేశమయ్యారు. ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తే మద్దతిస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని, ప్రభుత్వం కచ్చితంగా భూసర్వే చేయాలని రెవెన్యూ ఉద్యోగులు కోరారు. రెవెన్యూను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసింది.

రెవెన్యూ శాఖను ఇతర శాఖలో విలీనం చేస్తే ఒప్పుకోం..! హెచ్చరిస్తున్న ఉద్యోగులు..!!
కేసీఆర్ ప్రకటనలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం సమావేశమైన రెవెన్యూ ఉద్యోగులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు మూడు రోజుల్లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకుంది. నాలుగున్నరేళ్లుగా రెవెన్యూ శాఖ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ఆయనకు నివేదించాలని తీర్మానించింది.

రాజుకుంటున్న రెవెన్యూ నిప్పు..! ప్రభుత్వానికి తగలనున్న సెగ..!!
తనకు తిరుగులేదని భావిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రెవెన్యూ అగ్గి గట్టిగానే సెగ తగిలేలా ఉంది. గతంలో ప్రశంసించి ఇంక్రిమెంట్లు.. బోనస్ లు ఇచ్చిన సీఎం ఇప్పుడు ఏకంగా రెవెన్యూ శాఖను తీసేస్తానంటూ హింట్ ఇవ్వటం.. ఉద్యోగాలు చేసుకునే వారికి సంఘాలెందుకంటూ ఎద్దేవాచేయటం.. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలపై సీఎం చేసిన కామెంట్స్ కూడా ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తించాయి.

సీయం ప్రకటన పట్ల భగ్గుమంటున్న ఉద్యోగులు..! పాలిటిక్స్ కు తమను బలిచేయొద్దంటున్న ఎంప్లాయిస్..!!
అయితే వీరి ప్రభావం ఎంతగా చూపుతుందనే పక్కనబెడితే కీలకమైన రెవెన్యూ యంత్రాంగం చేతులు ఎత్తేస్తే పరిపాలనపై తప్పకుండా ఉంటుందనేది మాత్రం బహిరంగ రహస్యం. అవినీతి కేవలం రెవెన్యూ విభాగంలోనే కాదు అన్నిచోట్ల ఉందంటూ ఉద్యోగులు చెబుతున్నారు. నిన్నటి వరకూ పొగిడిన సీఎం తమను పక్కన బెట్టేందుకు కారణం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

అవినీతి పేరుతో అంతం చేయొద్దు..! మరో ఉద్యమం చేస్తామంటున్న ఉద్యోగులు..!!
ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు వ్యక్తిగత స్వార్ధం కోసమే ఇప్పుడు రెవెన్యూను లేకుండా చేయాలని చూస్తున్నారంటూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. వాస్తవానికి అవినీతి జాబితాలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు ఉంటాయి. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉండి, సేవలు పొందేందుకు అనువైన శాఖలన్నీ దాదాపు అవినీతి గబ్బు అంటుకున్నవే. వాటిలో గతంలో బీ ఎస్ ఎన్ ఎల్ కూడా ఉండేదని రెవెన్యూ ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications