Kondagattu: వేములవాడ, కొండగట్టులో భక్తుల రద్దీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాజన్న దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తు భారీగా తరలొచ్చారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొంత మంది భక్తులు కోడెలు కట్టేసి మొక్కు చెల్లించుకున్నారు.

అటు జగిత్యాల జిల్లా కొండగట్టులో అంజన్న ఆలయంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగింది. ఈసారి మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో మేడారం వెళ్లే భక్తులందరూ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారు. దీంతో వేములవాడ, కొండగట్టుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలొచ్చారు. అంజన్న ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో దర్శనాని రెండు గంటల సమయం పడుతుంది.

 The rush of devotees continues in Vemulawada and Kondagattu

పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను బొజ్జ పోతన్న పార్కింగ్ ప్లేస్ లోనే పార్కింగ్ చేసేలా చేస్తున్నారు. భక్తులు వాహనాలు పార్కింగ్ చేసి కాలినడకన గుట్టకు చేరుకుంటున్నారు. అయితే కొండగట్టులో సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు అందుబాటులో లేదని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. త్వరలో హనుమాన్ దీక్షపరులు కూడా రానున్నారు.

వారు వచ్చేసరికైనా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరోవైపు మేడారం జాతరకు ఏర్పాట్లు కొనసాగుతోన్నాయి. ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు జాతర కొనసాగునుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+