తెలంగాణ‌లో ఆ సీటు సెప‌రేటేనా..? ఆ ఎమ్మెల్యే దారి ర‌హ‌దారేనా..?

హైద‌రాబాద్ : మ‌హాకూట‌మిలో విచిత్ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూట‌మిలో ఏ సీటు ఎవ‌రికి ద‌క్కుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు త‌లెత్తాయి. విచిత్రంగా కొన్ని స్థానాల్లో సిట్టింగులు త‌మ స్థానాలను త్యాగం చేయాల్సిన ఆవశ్య‌క‌త నెల‌కొంటే మ‌రికొన్ని చోట్ల అయోమ‌యం చోటుచేసుకుంది. ముఖ్యంగా ఎస్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి సీటు ఎవ‌ర‌కి కేటాయిస్తారో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ క్రిష్ణ‌య్య‌కే అర్థం కాని ప‌రిస్తితులు నెల‌కొన్నాయి. క్రిష్ణ‌య్య‌కు సారి సీటు ఉంటుందా..? పొత్తులో భాగంగా వ‌దులుకోవాల్సి వస్తుందా..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

తెలంగాణ‌లో విచిత్ర‌ పరిస్థితులు..! ఎవ‌రి సీటు ఎటు వెళ్తుందో తెలియ‌ని ప‌రిణామాలు..!!

తెలంగాణ‌లో విచిత్ర‌ పరిస్థితులు..! ఎవ‌రి సీటు ఎటు వెళ్తుందో తెలియ‌ని ప‌రిణామాలు..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితులు ఎదుర్కొటోంది తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని దక్కించుకున్న ఆ పార్టీ, తెలంగాణలో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకే కొద్దిరోజుల్లో జరగబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపించాలనుకుంటున్న టీడీపీ చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. ఈ రెండు పార్టీలకు తోడు మరో మూడు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

కూట‌మిలో కీలక చ‌ర్చ‌లు..! ఎల్బీ న‌గ‌ర్ ఆర్ క్రిష్ణ‌య్య కేనా..?

కూట‌మిలో కీలక చ‌ర్చ‌లు..! ఎల్బీ న‌గ‌ర్ ఆర్ క్రిష్ణ‌య్య కేనా..?

ప్రస్తుతం సీట్ల సర్ధుబాటుకు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఉమ్మడి అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవహార శైలి, కూటమిలోని మిగతా పార్టీలను ఇబ్బంది పెడుతోంది. పొత్తుల విషయంలో వేగంగా పని చేసిన ఆ పార్టీ, సీట్ల సర్ధుబాటుపై ఏ నిర్ణయం తీసుకోకపోవడమే దీనికి కారణం. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఈ కారణంగానే సీట్ల సర్ధుబాటు వ్యవహారాన్ని ఆలస్యం చేస్తుందనే ఆరోపణలు తెల‌ర‌మీద‌కు వ‌స్తున్నాయి.

టీడిపి లో ఉంటారా..? లేక‌ బీఎల్ఎఫ్ తరపున పోటీ చేస్తారని ప్రచారం..!

టీడిపి లో ఉంటారా..? లేక‌ బీఎల్ఎఫ్ తరపున పోటీ చేస్తారని ప్రచారం..!

కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుంచే విజయం సాధించినా ఏ రోజూ ఆ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించలేదు. పార్టీ వ్యవహారాల కంటే బీసీల కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించారు. పేరుకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ నుంచి పోటీ చేయడంలేదనే చ‌ర్చ వినిపిస్తున్న నేపథ్యంలో, కృష్ణయ్య గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, బీఎల్ఎఫ్ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

కొంప ముంచిన క్రిష్ణ‌య్య వాఖ్య‌లు..! అస‌హ‌నంగా ఉన్న టీడిపి..!

కొంప ముంచిన క్రిష్ణ‌య్య వాఖ్య‌లు..! అస‌హ‌నంగా ఉన్న టీడిపి..!

తాజాగా కాంగ్రెస్ నేతలు ఆయనను కలవడం చర్చనీయాంశం అయింది. వాస్తవానికి టీడీపీ, కాంగ్రెస్‌కు సమర్పించిన అభ్యర్థుల జాబితాలో ఆర్ కృష్ణయ్య పేరు లేదని, అందుకే ఆయన వేరే పార్టీ నుంచి పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తాజాగా టీడీపీ జాబితాలో తన పేరు లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. ఇటీవల టీడీపీ జాబితా ఇదేనంటూ పలు వార్తా పత్రికలు, చానెళ్లు ప్రసారం చేసిన జాబితాలో కూడా కృష్ణయ్య పేరు కనపబకపోవడం కొసమెరుపు. మొత్తానికి ఆయనను టీడీపీనే వదులుకోడానికి రెడీ అయ్యింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+