విషాదం: గోడకూలి ఇద్దరు చిన్నారుల మృతి
హైదరాబాద్: నగరంలోని బోరబండ సైట్-3 వీకర్ సెక్షన్‌లో సోమవారం అర్ధరాత్రి ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రభుత్వం పేదలకు కోసం నిర్మించిన ఈ ఇళ్లు నాసీరకంగా ఉన్నందునే కూలిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనను మీడియాకు తెలియకుండా సంబంధిత అధికారులు ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గోడకూలిన ఘటనలో దంపతులతోపాటు వారి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. నాసీరకంగా నిర్మాణాలు చేపట్టిన అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడు, నాలుగేళ్ల క్రితమే నిర్మించిన ఈ నిర్మాణాలు అప్పుడే కూలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మూడు రోజుల క్రితమే బాధిత కుటుంబం ఈ ఇంట్లోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications