వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు బాటలోనే సీఎం కేసీఆర్ - సంచలన నిర్ణయం..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం లోని బీజేపీ పైన రాజకీయ పోరాటం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు రాష్ట్రంలో అనుమతి నిరాకరిస్తూ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలో సిబిఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 51 ద్వారా స్పష్టత ఇచ్చింది.

నాడు చంద్రబాబు..నేడు కేసీఆర్

నాడు చంద్రబాబు..నేడు కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ ను కలిసారు. ఆ రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ సమర్ధించారు. మిగిలిన ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. అందులో భాగంగానే తెలంగాణలోనూ ఇదే నిర్ణయం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

2019 ఎన్నికలకు ముందు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఇదే రకంగా నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో సీబీఐ అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ

రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ

అప్పట్లో ఆ నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దేశ వ్యాప్త సోదాలు.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ విచారణ కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం సీబీఐకు అనుమతి నిరాకరిస్తూ ఆగస్ట్ 31,2022 న హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1946 సెక్షన్‌ ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో సీబీఐ ద‌ర్యాప్తు నిర్వ‌హించాలనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, మేఘాల‌య‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌తో క‌లిపి తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి త‌మ రాష్ట్రంలో ప్ర‌వేశాన్ని నిషేధించాయని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

హీట్ పెంచుతున్న రాజకీయ పరిణామాలు

హీట్ పెంచుతున్న రాజకీయ పరిణామాలు


రాష్ట్రంలో విచారణ చేయాల్సి ఉండి, స్థానిక ప్రభుత్వాలు అనుమతించపోతే సీబీఐ న్యాయస్థానం ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పే ఛాన్స్ ఉండదు. కేంద్రం విచారణ సంస్థల పేరుతో రాజకీయ వేధింపులకు దిగుతోందనే ఆరోపణలతో కొన్ని రాష్ట్రాలు ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక, ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన రాజకీయంగా ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి.

English summary
Telangana Govt sensationa decision that, issues no entry order to CBI in to the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X