అప్పుడు తెలంగాణ కోసం.!ఇప్పుడు దేశం కోసం.!ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ ప్రత్యక్ష పోరాటం.!

ఢిల్లీ/హైదరాబాద్ : యోధుడు రణరంగాన్ని చూసి పిరికితనంతో పారిపోడు.. ధీరుడు యుద్ద క్షేత్రంలో తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాడు తప్ప వెన్నుచూపడు. లక్ష్య సాధనలో రంగంలోకి దిగిన తర్వాత వీరోచితంగా పోరాడే వాడినే విశ్వ విజేతగా కీర్తిస్తారు. అరవీర భయంకర హాహాకారాలతో మృత్యువు వికటాట్టహాసం చేస్తూ గుండెలో వణుకు పుట్టిస్తున్నా.. చెదరని, బెదరని ఆత్మవిశ్వాపంతో కదనరంగంలో కాలుదువ్వే వాడే నిఖార్సైన నిజమైన సాహసవంతుడు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జీవన ప్రయాణం మొత్తం సాహసోపేతంగా కోనసాగడంతో పాటు మేరు పర్వతం లాంటి మోదీని ఢీ కొట్టడంలో తగ్గేదేలే అనే ఆత్మవిశ్వాసం దేశానికే వినూత్న ధైర్యాన్ని రగిలిస్తోంది. 40ఇంచుల ఛాతీతో ఢిల్లీలో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి జాతీయ స్థాయిలో బీజేపితో అమీతుమీ తేల్చుకునేందుకు వీరోచిత అడుగులేస్తున్నారు చంద్రశేఖర్ రావు.

అప్పుడు రాష్ట్రంకోసం.. ఇప్పుడు దేశం కోసం.. కేసీఆర్ కొత్త పోరాటం..:పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప.. అన్న మహానుభావుడి వ్యాఖ్యలను తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు బాగా వంటపట్టించుకున్నట్టు తెలుస్తోంది. కార్యం ఏదైనా చంద్రశేఖర్ రావు దృష్టిపెడితే దాని అంతుచూసే వరకూ విడిచిపెట్టరు. సాధించే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా, ఎన్ని అవాంతరాలు కబళించివేయాలని చూసినా చంద్రశేఖర్ రావు చాకచక్యంగా వ్యవహరిస్తారు తప్ప కాడి వదిలేసి నమ్ముకున్న సిద్దాంతాన్ని, తనను నమ్మిన ప్రజానికాన్నీ మద్యలో పాతరేయరు. కార్యసాధనలో చంద్రవేఖర్ రావు చూపించే తెగింపు, సాహసం, ధైర్యం, మొక్కవోనీ ఆత్మ విశ్వాసం భావితరాలకు ఓ నిఘంటువుగా పరిణమిస్తుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

 kcrmodi-

అసాద్యాన్ని సుసాద్యం చేసిన ధీరుడు..:తెలంగాణ సాధన ప్రక్రియలో ఎదురైన సవాళ్లను, అవమానాలను అస్త్రాలుగా మలుచుకుని సింహంలా గర్జించి ఢిల్లీ గుండెల్లో దడపుట్టించిన సాహసోపేత చరిత్ర చంద్రశేఖర్ రావుది. అసాద్యమనుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని అంచెలంచెలుగా ముందకునడిపి సుసాద్యం చేసి దేశానికే డైనమిజాన్ని చూపించిన నాయకుడు చంద్రశేఖర్ రావు. సాధించుకున్న తెలంగాణలో రాజకీయ అనిశ్చితి ఏర్పకుండా, అంతర్గత విప్లవాలు లేకుండా, ప్రతిపక్షాల బెదిరింపులు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చి దిద్దడంలో చంద్రశేఖర్ రావు చూపించిన చొరవ దేశానికే గర్వకారణంగా పరిణమించింది.

కూతురుపై అభియోగాలు.. ఐనా బెదరని తండ్రి..:ఏ రాష్ట్రమైనా కేంద్రప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఇచ్చి పుచ్చుకోవడం వంటి కార్యకలాపాలు కూడా ఆరోగ్యవంతమైన, ఆమోదయోగ్యమైన వాతావరణంలో పరస్పర అవగాహనతో ముందుకెళ్లాలి. కేంద్ర రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో అదో ప్రధాన విధానం. కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు పటిష్టంగా కొనసాగుతూ పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లడంలో విభేదించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య ఓ పూడ్చలేని అగాధం కూడా ఏర్పడింది. అంతే కాకుండా ముఖ్యమంత్రి తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన విచారణ సంస్థల అభియోగాలు, విచారణ రోజుకో మలుపు తీసుకుంటున్న క్రమంలో కూడా కేంద్రానికి చంద్రశేఖర్ రావు ఏమాత్రం తలవంచడంలేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల మద్యే తేల్చుందాం అనే తెగింపుతో చంద్రశేఖర్ రావు అడుగులేస్తున్నారు.

 kcr2

ఢిల్లీ కేంద్రంగా పోరాటం..:దేశం నుంచి రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపిలను తరిమికొట్టాలన్నదే చంద్రశేఖర్ రావు ఎజెండాగా తెలుస్తోంది. అదే క్రమంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు గులాబీ చీఫ్. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందించిన మరక్షణమే తన ఆంతర్యం ఏంటో దేశ ప్రజలకు చెప్పారు చంద్రశేఖర్ రావు. అధికారంలో ఉన్న బీజేపితో ప్రత్యక్ష యుద్దం చేసేందుకు, ప్రతిపక్షాల మద్య ఐక్యతారాగం పాడించేందుకు నడుం బిగిస్తున్నారు. అందులో భాగంగా రేపు గురువారం రోజున ఢిల్లీ కేంద్రంగా వసంత విహార్ లో నూతన పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తున్నారు చంద్రశేఖర్ రావు. దీంతో ఆయన పోరాటం తెలంగాణ టూ ఢిల్లీ వయా మహారాష్ట్ర మీదుగా దేశ రాజధాని గుండెల్లో రైళ్లు పరుగెత్తించేందుకు బీజం నాటుతున్నారు తెలంగాణ సాధకుడు చంద్రశేఖర్ రావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+