Hyderabad: రష్యా సైన్యంలో హైదరాబాదీలు.. ఎరక్కపోయి ఇరుక్కుపోయారు..
హైదరాబాద్‌కు చెందిన ముగ్గురితో సహా పలువురు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఉక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొంటున్నారు. ఏజెంట్లు రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి రష్యా ఆర్మీలో చేర్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 2023 నుంచి దాదాపు 10 మంది భారతీయులు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో మారియుపోల్, ఖార్కివ్, డోనెట్స్క్, రోస్టోవ్-ఆన్-డాన్‌లతో సహా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. వీరిలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది.
రష్యా సైన్యంలో ఇరుక్కుకుపోయిన యువకుల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ముగ్గురు, గుజరాత్‌కు చెందిన ఒకరు, కాశ్మీర్‌కు చెందిన ఇద్దరు, యూపీకి చెందిన ఒకరు ఉన్నారు. హైదరాబాద్ చెందిన మహ్మద్ అద్నాన్ సోదరుడు ఉపాధి కోసం రష్యా వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత బలవతంగా సైన్యంలో చేర్చుకున్నట్లు మహ్మద్ అద్నాన్ చెప్పాడు. ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న యూట్యూబర్ రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తానని తన సోదరుడిని మోసం చేశాడని వివరించాడు.

తమకు మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని పలువురు ఏజెంట్లు యువకులను నమ్మించారని పేర్కొన్నాడు. డిసెంబరులో రష్యాకు రెండవ రిక్రూట్‌లను పంపిన తరువాత, ఏజెంట్లు అదృశ్యమయ్యారని అన్నాడు. ప్రొబేషన్ పీరియడ్‌లో నెలకు రూ.45,000 జీతం ఇస్తామని, మెడికల్ క్యాంపులు లేదా సెక్యూరిటీ పొజిషన్లలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని యువకులను ప్రలోభపెట్టినట్లు వివరించాజు. తర్వాత జీతం పెంచుతామని కూడా చెప్పినట్లు గుర్తు చేశాడు.
రష్యన్ భాషలో వ్రాసిన ఒప్పందాలపై సంతకం సంతకం అద్నాన్ చెప్పాడు. వారు అనువాద కాపీలను కోరినప్పుడు, ఏజెంట్లు అందించలేదని పేర్కొన్నాడు. తన సోదరుడు రష్యా చేరుకున్న తర్వాత, వారికి రక్షణ ముసుగులో ఆయుధాలు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత వారిని బలవంతంగా ఆయుధ శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ యుద్ధభూమికి పంపించారని విరించాడు. వార్ జోన్‌లో మొబైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేకపోవడంతో ఉక్రెయిన్‌కు పంపినప్పటి నుంచి తన సోదరుడిని సంప్రదించలేకపోయాడని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
జనవరి 23న కాల్పుల్లో ఒక యువకుడు గాయపడడంతో రష్యా సైన్యంలో భారతీయులు ఉన్నట్లు తేలింది. గాయపడిన యువకుడిని వైద్య శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి అతను తన కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబాలు సంబంధిత పత్రాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించాయి. యువకులను రక్షించాలని అధికారులను కోరాయి. బాధిత కుటుంబాలు దాదాపు నెల రోజులుగా కేంద్రం నుండి ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నాయని అద్నాన్ చెప్పారు.
రష్యా రెండు సంవత్సరాలుగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. ఈక్రమంలో ఎంతో మంది రష్యా సైనికిలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇతర దేశాలను నుంచి యువకులను తీసుకుని ఆర్మీలో చేర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications