Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi: రాహుల్ గాంధీ పర్యటనలో మార్పులు..

కాంగ్రెస్ అగ్రనేత గత రెండు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటన స్వల్ప మార్పులు చేశారు. రాహుల్ అనివార్య కారణాలతో శుక్రవారం కొన్ని పర్యటనలు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. అనుకున్న ప్రకారం రాహుల్ బోధన్, నిజామాబాద్ లో పర్యటించాల్సి ఉంది. రాహుల్ గాంధీ ఆ రెండు పర్యటనలు రద్దు చేసుకున్నారు. ఆయన బోధన్ లో బీడీ కార్మికులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, గల్ఫ్ కార్మికులతో సమావేశం కావాల్సి ఉంది. ఆ తర్వాత ఆర్మూర్ కు వెళ్లాలి.

అయితే బోధన్ వెళ్లకుండా రాహుల్ నేరుగా ఆర్మూర్ వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత నిజామాబాద్ కు వెళ్లి అక్కడ పసుపు రైతులతో భేటీ కావాల్సి ఉంది. దాన్ని కూడా రద్దు చేశారు. రాహుల్ గాంధీకి ఢిల్లీలో అత్యవసర మీటింగ్ ఉండడం వల్లే మార్పులు చేశామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీ ​శుక్రవారం ఉదయం 9గంటలకు చొప్పదండి నియోజకవర్గం గంగాధర వద్ద సమావేశంలో రాహుల్ ​పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు కొండగట్టు వెళ్లి అంజన్నను దర్శించుకుంటారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్​ మీటింగ్​లో పాల్గొంటారు.

 There have been slight changes in Rahul Gandhis visit to Telangana

మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, ఒంటిగంటకు కోరుట్లలో ప్రచారం చేస్తారు. అనంతరం 2:30 గంటలకు ఆర్మూర్​ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తారు. రాహుల్ గాంధీ గురువారం భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఒకవైపు సీఎం కేసీఆర్‌‌‌‌, ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యమైన అధికారులు ఉంటే.. మరోవైపు ప్రజలు ఉన్నారని చెప్పారు.

పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభతో, కరీంనగర్ రాజీవ్ చౌక్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. దళితులను, గిరిజనులను కేసీఆర్ మోసం చేశారని గుర్తు చేశారు. డబుల్‌‌ బెడ్‌‌ రూమ్‌‌ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, రూ.లక్ష రుణమాఫీ.. ఇలా కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్‌‌ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కర్ణాటక, రాజస్థాన్‌‌, చత్తీస్‌‌గఢ్​‌లో ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాల పనితీరే ఇందుకు నిదర్శమన్నారు. తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్‌ ‌మీటింగ్‌‌లోనే తొలి సంతకం చేసి అమలు చేస్తామని స్పష్టం చేశారు.

బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ, ఎంఐఎం మూడూ ఒక్కటేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే బీఆర్‌‌ఎస్‌‌కు వేసినట్టే అవుతుందని వివరించారు. అందుకే తెలంగాణలో బీఆర్‌‌ఎస్‌ ను, కేంద్రంలో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం.. తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదని రాహుల్ గాంధీ నిలదీశారు. రాహుల్ గాంధీ కరీంనగర్ లో బస చేశారు.

లోకి దిగే అభ్యర్థులందరికీ గ్యాస్ లిండర్ గుర్తు కేటాయించనుంది. అయితే కనీస సీట్లలో ఆ పార్టీ పోటీ చేయాలి. అలా చేస్తే ఆ గుర్తును ఇతరులకు కేటాయించరు. లేని పక్షంలో ఇతరులకు కూడా ఆ గుర్తు కేటాయిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఈ తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులతో కలిసి సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం ఈ పార్టీని స్థాపించారు. పార్టీని రిజిస్టర్ కూడా చేసుకున్నారు. ఆ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 సెగ్మెంట్లలో పోటీ చేస్తామని ఎన్నికల సంఘానికి ఈ పార్టీ దరఖాస్తు చేసుకుంది. వారి విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ పలు షరతులతో గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా.. బాలరంగం 1983 నుంచి కేసీఆర్ తోనే ఉన్నారు. 1987, 1995లో పొన్నాల గ్రామ సర్పంచ్ గా చేశారు. 2001లో సిద్దిపేట మండల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. 2006లో సిద్దిపేట మండల జడ్పీటీసీ సభ్యుడిగా, 2019 నుంచి 2021 వరకు ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగారు. తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్న బాలరంగం సికింద్రాబాద్ లోని ఓల్డ్ అల్వాల్ లో ఉన్న తన ఇంటి చిరునామాను పార్టీ ఆఫీసు అడ్రస్ గా పేర్కొన్న విషయం తెలిసిందే.

మరోవైపు కేసీఆర్ నాయకత్వంలో 2001 తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించింది. వారు 2018 ఎన్నికల వరకు టీఆర్ఎస్ పేరు మీదుగానే పోటీ చేశారు. ఆ తర్వాత పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చారు. అయితే ఈ టీఆర్ఎస్ పార్టీ వల్ల బీఆర్ఎస్ కు కాస్త నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+