CPI, CPM: వామపక్షాల దారెటు..! ఒంటిగానే బరిలోకి దిగుతాయా..!

తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు వామపక్షాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. కానీ రాను రాను వారి బలం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత వామపక్షాలు మరింత బలహీన పడ్డాయి. తెలంగాణలో సీపీఎం, సీపీఐ బలం తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు ప్రధాన పార్టీలు సీపీఎం, సీపీఐతో పొత్తులు పెట్టుకోడానికి ముందుకు వచ్చేవి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. ఒంటరిగా పోటి చేస్తే సీటు గెలిచేంతా సత్తా ఆ పార్టీల్లో లేదని మిగతా పార్టీల నేతలు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని అందరూ భావించారు. అటు సీపీఎం, సీపీఐ నేతలు బీఆర్ఎస్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. కానీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 115 మంది ఇప్పటికే జాబితా ప్రకటించారు. దీంతో వామపక్షాలు దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మునుగోడులో విజయం కోసమే కేసీఆర్ వామపక్షాలతో దోస్తీ చేశాడని.. పొత్తుల కోసం కాదని చెబుతున్నారు.

There is a possibility that CPM and CPI will contest alone in the next assembly elections

అయితే వామపక్షాలకు ఇప్పటికీ పలు జిల్లాల్లో ప్రభావం చూపేవింధంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వామపక్షాలు ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగేందుకు ఆ పార్టీలు యోచిస్తున్నాయి. పార్టీ బలంగా ఉన్న చోట పోటీ చేయాలని భావిస్తున్నారు.ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న చోట బరిలోకి దిగాలని సీపీఎం, సీపీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీపీఐ, సీపీఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో చర్చలు జరుగతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐకి బలమున్న ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డ్ చెప్పారు. హుస్నాబాద్ లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం తమకు లేదని చాడ స్పష్టం చేశారు. బీజేపీ పార్టీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+