వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక రాజకీయాల్లో పోటీ చేసే అవసరం రాకపోవచ్చు.!నాకు 75ఏళ్లు.!ఓటమి తర్వాత జానారెడ్డి అంతర్మదనం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత కాంగ్రెస్ అభ్యర్ది కుందూరు జానారెడ్డి స్పందించారు. ఈ ఒక్క గెలుపు ఓటమి వల్ల పార్టీలకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని తెలిపారు. తాను గెలిచినా ఇదే మాట చెప్పేవాడినని తెలిపారు. వయసు రీత్యా తాను కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు జానారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో తనకు రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం రాకపోచ్చని జానారెడ్డి జానారెడ్డి అభిప్రాయపడ్డారు. రాజకీయాల నుండి ఒకరకంగా శాశ్వత సెలవు తీసుకుంటున్నట్టు జానారెడ్డి నర్మగర్బ వ్యాఖ్యలు చేసారు.

 కొంతకాలం రాజకీయాలకు సెలవు.. జానారెడ్డి వినూత్న ప్రకటన..

కొంతకాలం రాజకీయాలకు సెలవు.. జానారెడ్డి వినూత్న ప్రకటన..

సాగర్ ఉప ఎన్నికల మాదిరిగానే మునుముందు చాలా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఒక్క ఓటమితో కృంగిపోకూడదని కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి తెలిపారు. తాను సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నది అబద్ధమని, తాను శాశ్వత అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. తాత్కాలిక పథకాల వల్ల అభివృద్ధి జరగదని, కొంత కాలం తర్వాత ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయని జానారెడ్డి తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును స్వాగతిస్తున్నట్లు, గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థిని అభినందిస్తున్నట్లు తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు , కాంగ్రెస్ టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు జానారెడ్డి.

 మళ్లీ పోటీ చేసే ఆతృత లేదు.. స్పష్టం చేసిన జానారెడ్డి..

మళ్లీ పోటీ చేసే ఆతృత లేదు.. స్పష్టం చేసిన జానారెడ్డి..

ఒక్క సీటు గెలుపుతోనో, ఓటమితోనో ప్రభుత్వ ఏర్పాటు లేదా పడగొట్టడం జరగదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ ప్రజాస్వామ్యం, ప్రజల్లో చైతన్యం కోసం ప్రయత్నించామని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ ఆలోచన మేరకు పోటీ చేశానని, సోనియా గాంధీ తన సూచనను పాటించి తెలంగాణ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు జానారెడ్డి. ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువల కోసం పోటీచేశానని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏం కోల్పోలేదని, సార్వత్రిక ఎన్నికలైతే ఫలితం వేరేలా ఉండేదని, ఈ ప్రొత్సాహంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వెళ్లాలని జానారెడ్డి సూచించారు.

 ఇక రాజకీయాలకు సెలవు.. చెప్పకనే చెప్పిన జానా రెడ్డి..

ఇక రాజకీయాలకు సెలవు.. చెప్పకనే చెప్పిన జానా రెడ్డి..

వయస్సు రీత్యా కొంత కాలం విశ్రాంతి తీసుకుంటానని జానారెడ్డి తెలిపారు. తనకు ఇప్పటి వరకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. రాబోవు రోజుల్లో పోటీ చేస్తానా లేదా అనేది పక్కన పెడితే, వయోభారం రీత్యా ఇంకా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మళ్లీ పోటీ చేయాలనే ఆతృత లేదని, తనకు ప్రస్తుతానికి 75 సంవత్సరాలని, భవిష్యత్తు లో నేను పోటీచేయాల్సిన అవసరం ఉండదనుకుంటున్నానని అన్నారు. అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడితే తప్ప మళ్లీ పోటీ చేయనని జానా రెడ్డి స్పస్టం చేసారు. ఉప ఎన్నికల్లో గెలిచినా ఇలాంటి నిర్ణయమే ప్రకటించే వాన్నని జానారెడ్డి అన్నారు.

 కరోనా తర్వాత సాగర్ ప్రజలను కలుస్తా.. ఎవ్వరూ అధైర్యపడొద్దన్న జానారెడ్డి..

కరోనా తర్వాత సాగర్ ప్రజలను కలుస్తా.. ఎవ్వరూ అధైర్యపడొద్దన్న జానారెడ్డి..

పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది, ఎంపిక విధానం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని జానా రెడ్డి తెలిపారు. రాజకీయాలకు విరామం తీసుకుంటున్నట్లు చేస్తున్న ప్రకటన
తన వ్యక్తిగత నిర్ణయమని జానారెడ్డి తెలిపారు. కరోనా తగ్గిన తర్వాత నియోజకవర్గ ప్రజలను కలుస్తానని, ఎవరూ బాధపడొద్దనొ, భయపడొద్దని జానారెడ్డి పిలుపునిచ్చారు. గెలుపోటములు అందరికీ సహజమని, రాజకీయాల పట్ల విరక్తి, వైరాగ్యం అనేవి తనకు లేవని అన్నారు. ఇప్పటి వరకు 11 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసానని, 20 ఏళ్ల వయస్సు నుంచి రాజకీయాల్లో ఉన్నానని జానారెడ్డి తెలిపారు.

English summary
Congress candidate Kunduru Janareddy reacted after his defeat in the Nagarjuna Sagar by-election. Janareddy said he had decided to stay away from politics for a few days due to his age.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X