సర్పంచ్‌ అభ్యర్థులకు కేటాయించే సింబల్స్‌ ఇవే..!

తెలంగాణలోని పల్లెల్లో పొలిటికల్ హీట్ రాజుకుంది. పంచాయతీ ఎన్నికల సంగ్రామం త్వరలోనే జరగనున్న నేపధ్యంలో మరోసారి రాష్ట్రానికి రాజకీయ రంగు అలుముకుంది. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. గెలుపొందిన అభ్యర్ధులు వారి నిర్ణయం ప్రకారం ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతారు. అందుకే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ గుర్తులు ఉండవు. ఈ క్రమంలోనే వారికి ప్రత్యేకంగా 'ఫ్రీ సింబల్స్‌'ను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కేటాయిస్తుంది.

వర్ణక్రమంలో అభ్యర్థుల పేర్లు..

కాగా నామినేషన్ పత్రాల ఆధారంగా రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల క్రమంలో వరుసగా ఒక జాబితా రూపొందిస్తారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన క్రమనికి ఇందుకు సంబంధం ఉండదు. అభ్యర్థి పేరులోని మొదటి అక్షరంనే పరిగణలోకి తీసుకుంటారు కానీ ఇంటిపేరు ఆధారంగా ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.

these-are-the-symbols-allotted-to-sarpanch-candidates-in-elections

అయితే ఒకే పేరుతో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీ చేస్తే మాత్రం ముందుగా ఇంటిపేరు మొదటి అక్షరం ఆధారంగా వారి క్రమాన్ని నిర్ణయిస్తారు. అంతకంటే ఎక్కువ పేర్లు ఒకేలా ఉంటే.. అభ్యర్థుల వృత్తి, నివాసం వంటి వివరాలతో ప్రత్యేక జాబితా తయారు చేస్తారు. ఇందులో గౌరవపదవులు, డిగ్రీలు పరిగణనలోకి తీసుకోరు.

ఎన్నికల చిహ్నాల కేటాయింపు విధానం..

అయితే సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలోని మొదటి గుర్తు, రెండవ అభ్యర్థికి రెండో గుర్తు ఇలా వరుసగా చిహ్నాలు కేటాయిస్తారు. వార్డు సభ్యుల జాబితాకు కూడా అదే విధానం అమలు చేస్తారు.

సర్పంచ్‌ అభ్యర్థులకు కేటాయించే ఫ్రీ సింబల్స్..

ఉంగరం, కత్తెర, క్రికెట్‌ బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా, బ్లాక్‌బోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్‌ హ్యాండిల్, టీ గ్లాస్, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మన్, తెరచాపతో పడవ, బిస్కెట్, వేణువు, చైన్, చెప్పులు, గాలిబుడగ, క్రికెట్‌ స్టంప్స్.

ఈ చిహ్నాలు పూర్తిగా ఫ్రీ సింబల్స్‌ కావడంతో రాష్ట్రంలోని ఏ అభ్యర్థికైనా వర్ణక్రమ జాబితా ఆధారంగా కేటాయిస్తారు. అంతే కాకుండా వీటితో పాటు "నోటా" (None of the above)కి కూడా స్థానం ఉంటుంది.

మరోవైపు ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగా నేటితో ( నవంబర్ 29, 2025 ) మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మొత్తంగా పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తికానున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుండగా.. ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచి ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+