అపార్టుమెంట్‌ను చుట్టుముట్టిన పోలీసులు: హ్యాపీ హోమ్స్‌లో దొంగలా, ఇంకేదైనా ఉందా?
మైలార్‌దేవ్‌పల్లి ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి యత్నించిన దుండగుల కారును పోలీసులు గుర్తించారు. ఉప్పరపల్లి హ్యాపీ హోమ్స్ అపార్టుమెంటు వద్ద దొంగల కారును గుర్తించారు.
హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి యత్నించిన దుండగుల కారును పోలీసులు గుర్తించారు. ఉప్పరపల్లి హ్యాపీ హోమ్స్ అపార్టుమెంటు వద్ద దొంగల కారును గుర్తించారు.
పోలీసులు అపార్టుమెంటులోని నాలుగో అంతస్తుల్లోని ఇళ్లలో దాగినట్లు పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో అపార్టుమెంటు చుట్టూ పోలీసులను మోహరించారు.
ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. హ్యాపీ హోమ్స్ దొంగలు ఉన్న నేపథ్యంలో ఆక్టోపస్ కూడా రంగంలోకి దిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అత్యాధునిక పరికరాలతో అక్టోపస్ పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. అపార్టుమెంటులోని ప్రతి ప్లాట్ తనిఖీ చేస్తున్నారు.
దొంగల వద్ద మారణాయుధాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హ్యాపీ హోమ్స్‌లో 9 బ్లాకులు, 500 ఇళ్లు ఉన్నాయి. దొంగలు ఎస్ 405, 406 అపార్టుమెంటులలో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

ఆధారాలు సేకరించిన పోలీసులు
మైలార్ దేవులపల్లి ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనం ప్రయత్నం కేసులో పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. ఉదయం ఏడు గంటల సమయంలో దొంగలు బొంగులూరు గేటు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకున్నారు. పది గంటల సమయంలో ముత్తూట్ ఫైనాన్స్ వద్దకు చేరుకున్నారు.
గం.10.30 నిమిషాలకు కస్టమర్ల మాదిరిగా ఏడుగురు దొంగలు లోనికి వెళ్లారు. ఇద్దరు బయట కాపలా ఉన్నారు. ప్లాన్ విఫలం కావడంతో అక్కడి నుంచి పారిపోయారు. పదిన్నర గంటల ప్రాంతంలో తుపాకులతో బెదిరించి దోచుకునే ప్రయత్నం చేశారు. అలారమ్ మోగడంతో దొంగలంతా పారిపోయారు.
దొంగలు టవేరా వాహనంలో పారిపోయారు. గం.10.40 నిమిషాలకు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న హ్యాపీ హోమ్స్ చేరుకున్నారు. అక్కడ టవేరాను పార్క్ చేశారు. నెంబర్ ప్లేటు తొలగించారు.
అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. దొంగతనం చేసేందుకు నెల రోజులుగా మకాం వేశారు. ఈ ముఠా ముంబై, గుజరాత్‌లకు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Recommended Video

ఆక్టోపస్ ఎందుకు?
ఆక్టోపస్, కౌంటర్ ఇంటిలెజినెన్స్, గ్రేహౌండ్స్ బలగాలను సాధారణంగా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లకు వినియోగిస్తారు. దొంగల కోసం ఆక్టోపస్ బలగాలను ఎందురు రప్పిస్తున్నారనే అంశంపై క్లారిటీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ దొంగలు మాత్రమే కాకుండా ఇంకేదో ఉందా అనే చర్చ సాగుతోంది.
మూడేళ్ల క్రితం ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన తీవ్రవాదులు బ్యాంకు దోపిడీకి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ముత్తూట్ దోపిడీ యత్నం కూడా ఉగ్రవాదులే చేసి ఉండవచ్చునా అనే అనుమానాలు కలుగుతున్నాయి.












Click it and Unblock the Notifications