ఇది బీజేపీ,టీఆర్ఎస్ కుట్ర.!బెదిరిస్తే బెదిరేదిలేదు.!నిందుతులపై చర్యలు తీసుకోవాలన్న రేవంత్.!

హైద‌రాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ఎన్నో చిత్ర, విచిత్రాల‌తో పాటు,మ‌రెన్నో కుట్ర‌ల‌ు చోటుచేసుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర‌, రాష్ట్ర అధికార పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ సంయుక్తంగా వ్యూహాలు ర‌చిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ప్ర‌చారానికి అడుగడునా ఇబ్బందులు సృష్టిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆ రెండు పార్టీలకు చెందిన‌వారు దగ్ధం చేశార‌ని, 24గంటల్లో నిందుతులను అరెస్టు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

చండూరులో కాంగ్రెస్ కార్యాల‌యానికి నిప్పు.. ఖండించిన పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి

చండూరులో కాంగ్రెస్ కార్యాల‌యానికి నిప్పు.. ఖండించిన పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా చండూరులో త‌న ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సోమ‌వారం అర్ధరాత్రి చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి ధ్వంసం చేయడం దారుణమ‌న్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగులబెట్టినా, మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రేవంత్ స్పష్టం చేశారు.

బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు.. తిప్పికొడతామన్న రేవంత్

బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు.. తిప్పికొడతామన్న రేవంత్

ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు వణుకు పుట్టిందని, బెదిరిస్తే బెదిరేది లేదని రేవంత్ స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిప‌క్షంలో న‌ల్గొండ ఎస్పీ కార్యాలయం ముందు తానే ధర్నా చేస్తాన‌ని హెచ్చ‌రించారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ ఘటనలో ఆఫీసులోని కండువాలు, పోస్టర్లు, బ్యానర్లతో పాటు ఇతర సామాగ్రి కాలి బూడిదైంద‌ని రేవంత్ రెడ్డి వివ‌రించారు.

నిందితుల‌పై 24 గంట‌ల్లో చ‌ర్య‌లు తీసుకోవాలి.. టీ సర్కార్ ను డిమాండ్ చేసిన రేవంత్

విషయం తెలుసుకున్న స్థానిక నేతలు కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారని రేవంత్ వివరించారు. సత్వర విచారణ జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగ‌ళ‌వారం చండూర్లో రేవంత్ సభ జరగనుంది. రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దుండగులు దగ్ధం చేసారని చర్చ జరుగుతోంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఎన్ని చేసినా మునుగోడులో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే.. క్యాడర్ కు రేవంత్ రెడ్డి భరోసా

ఎన్ని చేసినా మునుగోడులో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే.. క్యాడర్ కు రేవంత్ రెడ్డి భరోసా

టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి కాంగ్రెస్ క్యాడర్ ని బెదిరిచే కుట్రా.. బెదిరిస్తే బెదిరేది లేదు.పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయలని, లేదంటే ఎస్పీ కార్యాలయం ముందు తానే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. బీజేపీ లకు వణుకు పుట్టింది. మునుగోడు లో కాంగ్రెస్ కి వస్తున్న ఆధారన చూసి ఓర్వలేక పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీ లకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+