వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది ముమ్మాటికి తెలంగాణ‌ పీసిసి వైఫ‌ల్య‌మే..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌లో అదికార టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమే అని చెప్పుకునే కాంగ్రేస్ పార్టీ అంతే స్థాయిలో బ‌లోపేతం కావాల్సింది పోయి రోజురోజుకు కుదేల‌వుతోంది. 2019లో అదికారంలోకి వ‌చ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే అని చెప్పిన మ‌రుక్ష‌ణ‌మే అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో ఆందోళ‌న చెంద‌డం స‌ర్వ‌సాధారణం అయిపోయింది. అందుకు తోడు తెలంగాణ పీసిసి ఛీఫ్ హోదాలో ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌కూడా వినిపిస్తోంది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నాయ‌క‌త్వం ప‌టిష్టంగా ఉంటే ముఖ్య‌నేత‌లు పార్టీ మారే ప‌రిస్థితులు త‌లెత్త‌వ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

ప్రాంతీయ పార్టీని ఎదుర్కోలేక కుదేల‌వుతున్న జాతీయ పార్టీ..

ప్రాంతీయ పార్టీని ఎదుర్కోలేక కుదేల‌వుతున్న జాతీయ పార్టీ..

తెలంగాణ కాంగ్రెస్ శ‌థిలావ‌స్థ‌కు చేరుకుంటోంది. పార్టీని ప‌ట్టాలెక్కించి ప‌రుగులు పెట్టంచే నాయ‌కుడు లేక క‌కావిక‌లం అవుతోంది. 130 యేళ్ల చరిత్ర కల్గిన ఆ పార్టీ గోడలు బీటలు వారుతున్నాయి. కూలడానికి సిద్ధమన్నట్లుగా కాంగ్రెస్ కట్టడం తయారౌతోంది. పార్టీని నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ ముందు కాకలు తీరిన జాతీయ పార్టీ కళ్లు తేలేస్తోంది. హేమా హేమాలు, దిగ్జజాలు, ఉద్దండపిండాలు గా ప్రఖ్యాతిగాంచిన కాంగ్రెస్ నాయకులు ర‌ణ‌రంగం నుండి స్వ‌చ్చందంగా త‌ప్పుకుంటున్నారు. 2019లో తెలంగాణ పీఠం తమదేనన్నపార్టీ నేతలు ఫిరాయింపు దారులు వెతుక్కుంటున్నారు. దాంతో పాటు నాయకత్వ వైఫల్యం కాంగ్రెస్ ను పట్టి పీడిస్తోంది. డజన్ల కొద్ది మంది సీనియర్లు ఉన్నప్పటికి పార్టీని నడిపించే నేత కరువయ్యారు. ఎన్నికలకు యేడాది ముందు నాయకులు ఒక్కొక్కరు అస్త్రసన్యాసం చేస్తున్నారు. కత్తి పట్టుకున్న నాయకుడు యుద్ధం చేస్తున్నట్లు నటిస్తున్నారనే విమర్శలున్నాయి.అందుకే సైనికులు వెన్ను చూపిస్తున్నారు. బతికుంటే బలుసాకైనా తింటామంటు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.

Recommended Video

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పునాదుల‌నుండి ప‌టిష్టం చేసే నాయ‌కుడు కావాలి..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పునాదుల‌నుండి ప‌టిష్టం చేసే నాయ‌కుడు కావాలి..

నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తి. హైదరాబాద్ నడి బొడ్డు నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని శివారు గ్రామం వరకు ప్రతి చోట ఆ పార్టీ జెండా ఎగురుతుంది. ఏ మూలకు వెళ్లినా ఆ పార్టీకి కార్యకర్తలున్నారు. ప్రతి పల్లెలో కాంగ్రెస్ కు నాయకులున్నారు. చూడటానికి అసంఘటితంగా కనిపించినప్పటికి అవసరానికి ఆ పార్టీ ఐక్యత చూపిస్తే సంచలనాలను స్రుష్టిస్తుంది. అంతటి శక్తి యుక్తులు కల్గిన కాంగ్రెస్ ఎందుకో జావగారిపోతోంది. ఎవరో ఒక నాయకుడి వచ్చి ఆక్సిజన్ నింపితే తప్ప లేచి నిలబడని పరిస్థితి.


పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చూడటానికి గంభీరంగా కనపడుతున్నప్పటికి పార్టీని గాడిలో పెట్టడంలో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. పార్టీలో ఐక్యత తీసుకురావడం ఆయన శక్తికి మించిన పనిగా మారింది. నాయకులను ఒక తాటి మీదకు తీసుకురాలేకపోయారు. దీనికి తోడు నేతల ఆకాంక్షలను తీర్చడంలో ఆయన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.


అధిష్టానం కంట్రోల్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారే తప్ప హైకమాండ్ ను కంట్రోల్ లో పెట్టుకునే స్థాయి ఆయనకు రాలేదు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి,సిద్దరామయ్య లా అధిష్టానాన్ని గుప్పిట్లో పెట్టుకొని పార్టీని నడిపించడం ఉత్తమ్ వల్ల కావడం లేదు. కనీసం తన అనుచరులకు పదువులు ఇప్పించుకునే ధైర్యం కూడా ఆయనకు లేకపోయింది. ఫలితంగా దానం నాగేందర్ ను కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది.

పీసిసి ఛీఫ్ లోపాలు కూడా క‌నిపిస్తున్నాయి.

పీసిసి ఛీఫ్ లోపాలు కూడా క‌నిపిస్తున్నాయి.

గత కొంత కాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి,దానం మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఉత్తమ్ బస్సు యాత్రకు కో ఆర్డినేటర్ గా కూడా దానం ఉన్నారు. బీసీ కోటాలో దానంకు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎఐసిసి కార్యదర్శి పదవి ఇప్పిస్తానని ఉత్తమ్ హామీ ఇచ్చారు. కాని ఈ రెండు పదవులను ఆయన నాగేందర్ కు ఇప్పించుకోలేకపోయారు. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఎఐసిసి కార్యదర్శిగా నియమిస్తు రాహుల్ గాంధీ ఆదేశాలు ఇచ్చారు.

ఈ ప్రకటన వచ్చిన గంటకే దానం నాగేందర్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీసీలకు కాంగ్రెస్ లో ఏ మాత్రం న్యాయం జరగడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బలమైన నాయకుడైతే నాగేందర్ కాంగ్రెస్ వీడి ఉండే వాడు కాదు. నాయకుడి సహజ లక్షణం తనను నమ్మిన వారికి న్యాయం చేయడం. కాని కాంగ్రెస్ మహా సముద్రంలో ఉత్తమ్ చిన్న నీటి బొట్టుల ా మారడంతో తెలంగాణ లో పార్టీ పరిస్థితి ఎటు కాకుండా పోతోంది.

తెలంగాణ‌లో అదికారం ఖాయ‌మంటారు.. అంత‌లోనే ఆవేద‌న‌కు లోనౌతారు..

తెలంగాణ‌లో అదికారం ఖాయ‌మంటారు.. అంత‌లోనే ఆవేద‌న‌కు లోనౌతారు..

ఇదే సమయంలో పార్టీ కోసం కష్టపడటానికి సిద్ధంగా ఉన్న నేతలను ఆయన పట్టించుకోవడం లేదు. డీకె అరుణ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి ,మల్లు భట్టి విక్రమార్క లాంటి డైనమిక్ లీడర్లను ఉత్తమ్ వినియోగించుకోవడం లేదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడి లాంటి నాయకుడు అవసరం. ఒక వైపు డైనమిజం చూపిస్తూనే మరో వైపు సమన్వయంతో వ్యవహారించాల్సి ఉంది.

ప్రత్యర్థి పార్టీలను చితక్కొట్టడంతో పాటు సొంత పార్టీని ఏక తాటిపైన నిలిచే లీడర్ కావాలి. అధిష్టానం స్వేచ్ఛనిచ్చి, సీనియర్లంతా కలిసి వస్తే తప్ప పీసీసీకి బలం వచ్చే సూచనలు కనిపించడం లేదు.ఇదంతా జరిగి, ప్రజలను మెప్పించి, టీఆర్‌ఎస్ ను ఓడించి అధికారం చేపట్టడం కలగానే అనిపిస్తోంది.

English summary
telangana congress party losing its identity in telangana. the senior leaders are leaving congress party and joining in ruling TRS party. so the largest historical congress party becoming week in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X