ఇది బీజేపీ అచీవ్ మెంట్; కేంద్రంపై, మోడీ సర్కార్ పై విరుచుకు పడిన ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, తెలంగాణకు కేటాయించాల్సిన నిధుల విషయంలోనూ సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అని, ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తుందని కేంద్ర సర్కార్ పై టార్గెట్ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు, ఏ చిన్న అవకాశం దొరికినా కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపిని తరిమికొట్టాలని సీఎం కేసీఆర్ మొదలుకొని తెలంగాణ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
ఇప్పటికే విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇలా ప్రతీ అంశంపై కేంద్రాన్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ కవిత తాజాగా మరోమారు కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. దేశంలో డాలర్ తో పోలిస్తే అత్యంత గరిష్ట స్థాయికి రూపాయి మారకం విలువ చేరడంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇది బీజేపీ అచీవ్మెంట్ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన కవిత డాలర్ కు 77.40 రూపాయలు ఆల్ టైం కనిష్టస్థాయికి రూపాయి మారకం విలువ పడిపోయిందని పేర్కొన్నారు.
BJP's achievement today
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 9, 2022
At 77.40₹ - Rupee at its all time low against #Dollar
The cost of #GasCylinder crosses the 1000₹ mark
Unemployment rate is at 7.83%
Yet, Modi Sarkar wants us believe that " Sab Changa Si "
ఇక గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయల మార్కును దాటింది అని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల పై మండిపడ్డారు కవిత. దేశంలో నిరుద్యోగం నిరుద్యోగ రేటు 7.83 శాతంగా ఉందని వెల్లడించారు. ఇదేనా మోడీ సర్కార్ మనకు చెప్పిన మంచి రోజులు అంటూ ప్రశ్నించిన కవిత ఇది బీజేపీ సాధించిన విజయమని పేర్కొన్నారు. ఇలాంటి బీజేపీని ఎందుకు ఆదరించాలి అని అందరి మదిలో ప్రశ్న ఉత్పన్నం అయ్యేలా ఆమె తన ట్వీట్ ను సంధించారు.

ఆమె తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి మోడీ సర్కార్ నడిపిస్తుందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే మంత్రి కేటీఆర్ కూడా నిత్యం దేశంలోని అధికార బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో కేంద్రం తీరును ఎండగడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేస్తోందంటూ విరుచుకుపడుతున్నారు.












Click it and Unblock the Notifications