90శాతం నువ్వే తీసుకో.. ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు ఇందుకే; తోట చంద్రశేఖర్ కౌంటర్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుర్తించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆస్తులను సీఎం కేసీఆర్ ఆంధ్ర వాళ్లకు కట్టబెడుతున్నాడని రఘునందన్ రావు ఆరోపించారు. ఇక ఆ డబ్బులనే తోట చంద్రశేఖర్ తో బిఆర్ఎస్ సభకు ఖర్చు పెట్టిస్తున్నారని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ సభకు ఖర్చు పెట్టిస్తున్న డబ్బుల వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరుగుతుందని రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

రఘునందన్ రావుకు తోట చంద్రశేఖర్ కౌంటర్
ఇక ఈ వ్యవహారంపై ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కౌంటర్ ఇచ్చారు. నాలుగు వేల కోట్ల విలువైన మియాపూర్ భూములను సీఎం కేసీఆర్ అప్పగించారని తనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలు అవాస్తమని ఆయన తేల్చి చెప్పారు. ఖమ్మంలో అత్యంత ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తుంటే మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

చిల్లర రాజకీయాల కోసమే నిరాధారమైన ఆరోపణలు
చిల్లర రాజకీయాల కోసమే, నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రశేఖర్ మండిపడ్డారు. రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే ఆ సర్వే నెంబర్ భూమిలో 90% తనని తీసుకోమని మిగిలిన 10 శాతం మాత్రమే తనకు ఇవ్వమని తోట చంద్రశేఖర్ సెటైర్లు వేశారు. ఇక ఇదే సమయంలో దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతుందని, తెలంగాణ మోడల్ ను దేశమంతటా అమలు చేయడం కోసం కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని తోట చంద్రశేఖర్ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ సారధ్యంలో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతిని దేశానికి పరిచయం చేస్తామని పేర్కొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు కూడా సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఖమ్మంలో నిర్వహించే సభ తర్వాత భారీ చేరికలు ఉంటాయని పేర్కొన్న తోట చంద్రశేఖర్ కెసిఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీ దేశ భవిష్యత్తు రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. ఇక తనపై సంచలన ఆరోపణలు చేసిన రఘునందన్ రావుకు తనకు కేసీఆర్ ఇచ్చాడని చెబుతున్న భూమిలో 90 శాతం తానే తీసుకొని, మిగిలిన 10 శాతం మాత్రమే తనకు ఇవ్వాలంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications