చంపేస్తామని మాజీ ఎంపికి బెదిరింపు కాల్స్
హైదరాబాద్: కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచరాం. ఈ మేరకు హైదరాబాదులోని హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ గత నెల 31వ తేదీన హుస్సైన్ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా, వద్దా అనే సందేహాన్ని తీర్చుకోవాడనికి పోలీసులు నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.

కేసు నమోదు చేయాలని కోర్టు ఈ నెల 5వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఐపిసి సెక్షన్ 507 కింద కేసు నమోదు చేశారు. ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది తేల్చడానికి పోలీసులు విచారణ చేపట్టారు.
అంజన్ కుమార్ యాదవ్ ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయపై ఓడిపోయారు.
-
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
హైదరాబాద్ TO అండమాన్ టూర్.. బడ్జెట్ ధరలోనే.. బీచ్ లో ఫుల్ గా చిల్ అవ్వొచ్చు..! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..!












Click it and Unblock the Notifications