సినీఫక్కీలో మూడు కార్లు ఢీ .. ఇద్దరు మృతి , నలుగురికి తీవ్ర గాయాలు
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సినీఫక్కీలో మితిమీరిన వేగంతో వెళ్తున్న మూడు కార్లు ఢీ కొట్టటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మొదట రెండు కార్లు ఢీ కొట్టాయి. వాటి వెనుకే ఉన్న మరో కారు వేగంతో ఉండటం వల్ల కంట్రోల్ తప్పి మూడో కారు కూడా ఢీ కొట్టింది.
ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు . గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వాహనాలు ద్వంసం అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications