కూలీ కోసం కూటి కోసం వచ్చి... కమాన్ కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్: కూలి కోసం కూటి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. హైదరాబాదులోని కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో చోటు చేసుకున్న విషాద సంఘటనలో ముగ్గురు మరణించారు. వసంతనగర్ పరిధిలోని సీబీసీఐడీ కాలనీ సమీపంలో ఓ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణంలో ఉన్న కమాన్ కూలి ఆ విషాద సంఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో కమాన్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో శిథిలాలు మీద పడటంతో ఒడిశాకు చెందిన జనార్థన్(50), శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగభూషణ్ (52), ధర్మారావు అక్కడికక్కడే మృతిచెందారు.

తిరుపతిరావు, యాదవ్, అంజి, రమణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణారావు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్, సైబరాబాద్ వెస్ట్‌జోన్ పోలీస్ కమిషన్ నవీన్‌చంద్ పరిశీలించారు.












Click it and Unblock the Notifications