నేటినుండి మొదలైన మూడు నెలల రేషన్ జాతర!!

తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేటినుంచి పండుగ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల బియ్యాన్ని నేటినుంచి పంపిణీ చేయనుండడంతో సామాన్య ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితి ఉంది. కేంద్రప్రభుత్వం వర్షాకాలం నేపథ్యంలో, వాతావరణ ప్రతికూల పరిస్థితులతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని, సరుకులను ఒకేసారి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకు సన్నద్ధమైన పౌరసరఫరాల శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మేరకు ఏర్పాట్లు చేసింది.

వర్షాకాలం అలెర్ట్ అయిన కేంద్రం
జిహెచ్ఎంసి తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 33జిల్లాలలో ఫోర్టిఫైడ్ రైస్ తో పాటు పంచదార, గోధుమలు కూడా రేషన్ దుకాణాలలో పంపిణీ చేయడానికి సిద్ధమైంది. వచ్చే మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యంతో పాటుగా గోధుమలు, పంచదార నేటినుంచి రేషన్ డీలర్లు ఇవ్వనున్నారు. ఈసారి ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రావడం, ఇప్పటికి అనేక రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడం వంటి అనేక ఘటనలతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.

Three-month ration with fine rice wheat and sugar festival starts today

Take a Poll

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి
వర్షాకాలం రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఇవ్వనున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మేరకు సన్నాహాలు చేసుకుని సన్న బియ్యాన్ని ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంది.

మూడు నెలల రేషన్ పంపిణీకి రేషన్ షాపుల్లో ఏర్పాట్లు
ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడానికి రేషన్ షాపుల్లో ఏర్పాట్లు చేశారు. ఒకే నెలలో మూడు నెలల సరుకులు పంపిణీ చేయవలసిన తమ మీద పని భారం పడుతుందని రేషన్ డీలర్లు చెబుతున్నారు.

పారదర్శకంగా సరుకుల పంపిణీ చేయాలన్న మంత్రి ఉత్తమ్
ఇక సామాన్య ప్రజలకు అందించే రేషన్ విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. డీలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా సరుకుల పంపిణీ చేయాలని ఆయన తెలిపారు.

లబ్ధిదారులు అంతా ఒకేసారి వెళ్లి ఇబ్బందులు పడొద్దని సూచన
ఇక మరోవైపు నెలరోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులు అంతా ఒకేసారి వెళ్లి ఇబ్బందులు పడరాదని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా రేషన్ ఇస్తారని అందరూ ఒకేసారి రేషన్ షాప్ ల పైన దండయాత్ర చెయ్యొద్దని వారు సలహా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+