మహిళలతో నగ్నంగా క్షుద్రపూజలు: ముగ్గురి అరెస్ట్
వరంగల్: క్షుద్రపూజలు నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్‌లోని గిరిప్రసాద్‌నగర్ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది.
కాలనీకి చెందిన ముగ్గురు మహిళల ఇటీవల కాలంలో అందంగా, బలంగా, పొడవైన వెంట్రుకలతో ఉన్న మహిళలకు గాలం వేసి వారిని క్షుద్రపూజల కోసం ఉపయోగిస్తున్నారు. శనివారం రాత్రి కూడా ఓ మహిళను క్షుద్రపూజల కోసం తీసుకెళ్లారు.
నగ్నంగా తయారుచేసి వింత చేష్టలు చేయడంతో.. బెదిరిపోయిన ఆ మహిళ ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రంగారెడ్డి జిల్లా పూడూరు మండల కేంద్రం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఓ చెట్టును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ సంఘటనలో ఓ మహిళ అక్కడిక్కడే మృతిచెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications