ఉదయం 6.30 నుంచి 10.30 వరకే ఒంటి పూట బడులు..!!

వేసవి తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఒంటి పూట బడులు అమలు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఒంటి పూట బడుల నిర్వహణలో పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో టైమింగ్స్ లో మార్పు చేసారు. అయితే, వేడి పెరుగుతున్న వేళ విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా సమయాల్లోనూ మార్పుల అవసరనే సూచన లు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒంటి పూట బడుల పైన కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి.

ఒంటి పూట బడులు
పెరుగుతున్న ఉష్ణోగ్రతల వేళ ఒడిశా ప్రభుత్వం తాజాగా ఒంటి పూట బడుల వేళల్లో మార్పులు చేసింది. ఒకటో తరగతి నుంచి 12 తరగతుల వరకు స్కూళ్లు ఇక నుంచి ఉదయం 6.30 నుంచి 10.30 వరకు మాత్రమే ఉంటాయని వెల్లడించింది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వేసవి ముగిసేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని
స్పష్టం చేసింది. అదే విధంగా వేసవి తీవ్రత వేళ విద్యార్ధులకు నీరు, ఓఆర్​ఎస్ అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఇక, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒంటి పూట బడులు ఇప్పటికే అన్ని స్కూళ్లల్లోనూ అమలు చేస్తున్నారు.

Timings changes for half days due to Temperatures increases Govt issues orders

మారిన వేళలు
ఏపీలో ఒంటిపూట బడుల్లో తాజాగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో 1.15 గంటలకే పాఠశాలలు ప్రారంభమయ్యేవి. మిగిలిన స్కూళ్లకు ఉదయం 7:45 గంటల నుంచి 12:30 గంటల వరకు విద్యాసంస్థలు పని చేసాయి. అయితే, తాజాగా చేసి న మార్పులతో పదోతరగతి పరీక్ష కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. మరోవైపు తెలంగాణలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి.

పెరుగుతున్న ఎండలతో
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట బడులు కొనసాగుతా యని అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠ శాలలు పని చేయనున్నాయి. అయితే, పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఒంటి గంట నుంచి సాయం త్రం 5 వరకు తరగతులు జరగనున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇక, వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మధ్నాహ్న వేళ ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+