Graduate MLC Result 2024: ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న..!
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతూన్నారు. మొదటి ముగిసేసారికి ఆయన ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. మల్లన్న 12 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 3 గంటలక వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలుకట్టడానికే సరిపోయింది.
ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో జంబో బ్యాలెట్ పేపర్ వాడారు. ఇది కూడా కౌంటింగ్ లేట్ కావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీకి కౌంటింగ్ కు సంబంధించి గురువారం సాయంత్రానకి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఒక వేళ రెండో ప్రధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 50 శాతం కన్నా ఒక్క ఓటు ఎక్కవ ఎవరికి వస్తే వారు విజయం సాధించినట్లు అవుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ గౌడ్ పోటీ చేశారు. నాలుగు రౌండ్లలో లెక్కిస్తున్నారు. ప్రస్తుతం రెండో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కో రౌండ్లో 96 వేల ఓట్లను లెక్కిస్తారు. ఆఖరి రౌండ్ లో మాత్రం 48,013 ఓట్లతో లెక్కింపు ప్రక్రియ ముగియనుంది.












Click it and Unblock the Notifications