హైదరాబాద్ లాడ్జిలో తిరుపతి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని భాగ్యలక్ష్మీ లాడ్జిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. తిరుపతికి చెందిన మురళి అలియాస్ అజ్మద్(32) ఆసిఫ్‌నగర్ గిర్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవడానికి అతను ఇస్లాం మతంలోకి మారాడు.

ఈ క్రమంలోనే ఏడు నెలల క్రితం ఆ యువతిని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం వీరి మధ్య వివాదాలు రావడంతో మూడు రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి లక్డీకాపూల్‌లోని భాగ్యలక్ష్మీ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. ఉదయం నిద్రలేపమని మేనేజర్‌కి చెప్పాడు.

Tirupathi man commits suicide in Hyderabad

శనివారం ఉదయం నిద్రలేపడానికి వెళ్లిన హోటల్ సిబ్బందికి రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆతహత్య చేసుకున్న మురళి కనిపించాడు. హోటల్ సిబ్బంది విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య చేసుకున్న యువకుడు గతంలో గంగజమున హోటల్‌లో పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. వైవాహిక జీవితంలో వచ్చిన మనస్పర్ధలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+