నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: సురక్షితంగా బయటపడ్డ కోదండరామ్

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ: నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ సురక్షితంగా ప్రాణపాయం నుండి బయటపడ్డాడు.తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యక్రమంలో పాల్గొని హైద్రాబాద్ కు తిరిగివస్తుండగా ఆదివారం సాయంత్రం ఆ ప్రమాదం చోటు చేసుకొంది.

తెలంగాణ జెఎసి ఛైర్మెన్ ప్రోఫెసర్ కోదండరామ్ ప్రయాణీస్తున్న కారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వాహనం రోడ్డుపై ఉన్న డివైడర్‌పైకి వెళ్ళి ఆగిపోయింది.

TJAC chairman Kodandaram Escapes Unhurt in Road Accident

దీంతో కారు ముందు బాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు. ఈ ప్రమాదం నుండి కోదండరామ్ నుండి సురక్షితంగా బయటపడిన జెఎసి అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి చెప్పారు.

ప్రమాద సమయంలో బెలూన్‌ తెరుచుకోవడంతో కారు లోపల ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో విజయవాడ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రించారు. కోదండరామ్‌ మరో వాహనంలో హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The vehicle in which TJAC Chairman Prof Kodandaram was travelling met with an accident on National Highway No. 65 near Veliminedu of Chityal mandal in Nalgonda district on Sunday evening

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి