వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా మీ వైపుంటే ఎందుకు ప్రలోభపెడుతున్నారు: కోదండరామ్

సింగరేణి కార్మికులపై నమ్మకంగా ఉన్న ప్రభుత్వం కార్మికులను విందులు, వినోదాలతో ఎందకు ప్రభావితం చేస్తున్నారని టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ప్రశ్నించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

భద్రాద్రి: సింగరేణి కార్మికులపై నమ్మకంగా ఉన్న ప్రభుత్వం కార్మికులను విందులు, వినోదాలతో ఎందకు ప్రభావితం చేస్తున్నారని టిజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ప్రశ్నించారు.

సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కార్మికులంతా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికే ఓట్లు వేస్తారని టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. అలాంటిది సింగరేణి కార్మికులు తమ ఓటు ద్వారా టిఆర్ఎస్‌కు చెంపపెట్టులాంటి తీర్పును ఇవ్వాలని కోదండరామ్ సూచించారు.

TJAC chairman Kodandaram slams on TRS

వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం సింగరేణి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కోదండరామ్ ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి వ్యతిరేకంగా ఎఐటీయూసీకి ఇతర కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. టిడిపి, కాంగ్రెస్, సిపిఐలు ఎఐటీయూసికి మద్దతును ప్రకటించాయి.

విపక్షపార్టీల నేతలు కూడ ఎఐటీయూసీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఒడించేందుకు అన్ని అవకాశాలను విపక్షాలు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి.

English summary
Tjac chairman Kodandaram made allegations on Trs govenament. He demanded that Kcr government should take necessary decision on heredity jobs in Singareni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X