కోదండరామ్ పార్టీ: ఎవరికీ లాభం, టిఆర్ఎస్‌కు చెక్ పెట్టేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై చర్చ సాగుతోంది. టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇదే విషయమై కోదండరామ్ స్పందించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని తమపై ఒత్తిడి ఉందని చెప్పారు కోదండరామ్. అయితే ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంపై కోదండరామ్‌కు మధ్య అగాధం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విదానాలపై కోదండరామ్ ఒంటి కాలిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

దీంతో టీజెఎసిలో ఉన్న కొన్ని సంఘాలు బయటకు వచ్చాయి. అయితే దీని వెనుక టిఆర్ఎస్ నాయకత్వం ఉందని ఆ సమయంలో ప్రచారం సాగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందున జెఎసి అవసరంలేదని జెఎసి నుండి బయటకు వచ్చిన సంఘాలు ప్రకటించాయి. అదే సమయంలో జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ పార్టీని ఏర్పాటు చేయాలనే ఒత్తిడి కూడ ఉందనే ప్రచారం సాగుతోంది.

రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి

రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి


రాజకీయ పార్టీ ఏర్పాటుపై మాపై ఒత్తిడి ఉంది, అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే జెఎసి తరపున పోరాటం పోటీ చేస్తామని కోదండరామ్‌తో కొందరు నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే రాజకీయ పార్టీ ఏర్పాటుకై త్వరలోనే నిర్ణయం వెలువడనుందనే ప్రచారం కూడ లేకపోలేదు.

టిఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు

టిఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం సాగిన సమయంలో టిజెఎసి నిర్వహించిన ఉద్యమాలు ఒకానొక సమయంలో టిఆర్ఎస్‌కు, కెసిఆర్‌కు సమాంతరంగా సాగాయి. మిలీనియం మార్చ్ లాంటి ఉద్యమం విజయవంతం చేసిన చరిత్ర జెఎసికి ఉంది. అయితే టిఆర్ఎస్‌లో చేరడానికి ఇష్టం లేని వారంతా జెఎసి రాజకీయ పార్టీగా అవతరిస్తే ఏ పార్టీకి చెందని వారి ఓట్లు కూడ కలిసివచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు కూడ లేకపోలేదు.కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న నేతలంతా కూడ జెఎసి నీడన చేరే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

కోదండరామ్ పార్టీ ఏర్పాటు చేస్తే ఎవరికీ నష్టం

కోదండరామ్ పార్టీ ఏర్పాటు చేస్తే ఎవరికీ నష్టం

తెలంగాణలో కోదండరామ్ పార్టీని ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఎవరికీ లాభం, ఎవరికీ నష్టమనే చర్చ కూడ సాగుతోంది. అయితే కోదండరామ్ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని కొంత కాలంగా టిఆర్ఎస్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. టిఆర్ఎస్ నేతలు కూడ కోదండరామ్‌పై విమర్శలను గుప్పించారు.ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే టిఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టే వాతావరణం ఇప్పుడిప్పుడే కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే జెఎసి రాజకీయ పార్టీగా అవతరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు..అయితే రాజకీయ పార్టీగా ఏర్పాటై... ఆ పార్టీ ఆచరణ కారణంగా ప్రజల్లో ఉండే ఆదరణ తదితర అంశాలు ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపనున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు జెఎసి పార్టీ ఏర్పాటుపై ఒక అంచనాకు రాలేమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

హైద్రాబాద్‌లో కొలువుల కొట్లాట సభ

హైద్రాబాద్‌లో కొలువుల కొట్లాట సభ


ఈ నెల 30వ, తేదిన హైద్రాబాద్‌లో కొలువుల కొట్లాట సభ జరుగుతుందని టీజెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ప్రకటించారు. ఈసభకు యువకులు పెద్ద సంఖ్యలో హారుకావాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One more political party under the aegis of the Telangana Political Joint Action Committee (TJAC) may enter the stage, and is likely to be different from the conventional political parties.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి