బాలికను రేప్ చేసిన వ్యక్తి సినీ హీరో సాయి ధరమ్ తేజ గార్డు

హైదరాబాద్: మూడో తరగతి బాలికపై హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గురువారం అత్యాచారం చేసిన వ్యక్తిని సినీ నటుడు ధరమ్ తేజ గార్డుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు దుబాసి నాగేందర్ తెలుగు సినీ హీరో సాయి ధరమ్ తేజ ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు శనివారంనాడు మీడియాలో వార్తలు వచ్చాయి.

నాగేందర్ చాక్లెట్లు ఇస్తానని బుజ్జగించి బాలికను తాను అద్దెంకు ఉంటున్న ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమపై అత్యాచారం చేశాడని చెబుతున్నారు. 23 ఏళ్ల నాగేందర్ మెదక్ జిల్లాకు చెందినవాడు. హైదరాబాదుకు చెందిన కృపా సెక్యూరిటీ ఏజెన్సీలో అతను సెక్యూరిటీ గార్డుగా చేరాడు.

అతన్ని సంస్థ పది రోజుల క్రితం సాయి ధరమ్ తేజ ఇంటి వద్ద నియోగించింది. అతను బంజారాహిల్స్‌లోని ఇందిరా నగర్‌లో ఉంటున్నాడు. గురువారం సాయంత్రం బాధితురాలితో పాటు ఇతర పిల్లలు అతని ఇంటి వద్ద ఆడుకుంటున్నారు.

 Tollywood actor Dharam Tej’s guard rapes minor girl

తల్లిదండ్రులు బాలికను ఆమె ఆంటీ వద్ద వదిలిపెట్టి ఆస్పత్రికి వెళ్లారు. నాగేందర్ ఆ బాలికను బుజ్జగించి ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. నాగేందర్ ఇంట్లోంచి ఏడుస్తూ వస్తున్న బాలికను ఏమైందంటూ ఆంటీ అడిగింది. దాంతో విషయాన్ని బాలిక ఆంటీకి చెప్పింది.

తాము చేర్చుకునేటప్పుడు నాగేందర్ నేపథ్యాన్ని పరిశీలించామని సెక్యూరిటీ ఏజెన్సీ చెప్పినట్లు అతని వ్యక్తిత్వం గురించి గానీ అతని చర్యల గురించి తమకు తెలియదని సినీ హీరో సన్నిహిత వర్గాలు చెప్పాయని దక్కన్ క్రానికల్ రాసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+