Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tollywood Gossips: అన్ని ఫ్లాప్ సినిమాలున్నా రాశీ ఖన్నాకు ఆఫర్స్ ఎలా వస్తున్నాయి..?

హైదరాబాద్: టాలీవుడ్‌లో గాసిప్స్‌కు అంతులేదు. ఏ చిన్న వార్త బయటకు పొక్కినా పలురకాలుగా సర్క్యులేట్ అవుతుంది. అలాంటి కొన్ని గాసిప్స్‌తో పాటు ఫిల్మీ అప్‌డేట్స్ కూడా ఓసారి చూసేద్దామా.

అందుకే రాశీ ఖన్నాకు ఆఫర్లు

అందుకే రాశీ ఖన్నాకు ఆఫర్లు

రాశీ ఖన్నా... ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కెరీర్‌ పరంగా పెద్దగా సక్సెస్ టేస్ట్ చేయలేదు. బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు ట్రై చేస్తున్న ఈ బబ్లీ బ్యూటీకి... తెలుగు ఇండస్ట్రీనే పెద్ద దిక్కుగా మారింది.పెద్ద అవకాశాలే వస్తున్నప్పటికీ... ఆమె నటించిన పలు చిత్రాలు ఫ్లాప్ కావడం ఆమెకు మైనస్‌గా మారింది. ఈ మధ్య కాలంలో వచ్చిన థాంక్యూ చిత్రంలో నాగచైతన్య సరసన, గోపీచంద్ హీరోగా వచ్చిన పక్కా కమర్షిషల్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తో కొట్టడంతో ఈ బ్యూటీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.కానీ ఇవి తాత్కాలికమే. ఎందుకంటే శర్వానంద్ సినిమాలో ఈ అమ్మడు మరో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య తీస్తున్నారు.

రాశీ ఖన్నా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ తీసుకుంటున్న తక్కువ రెమ్యూనరేషన్‌తో పాటు ఈమె యాటిట్యూడ్ సినిమా అవకాశాలు తీసుకొచ్చి పెడుతున్నాయంటూ ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఈమె ఎప్పుడూ సహచర నటులతో, సినిమా క్రూతో కూల్‌గా ఉంటారనే మంచి టాక్‌ను మూటగట్టుకుంది.అంతేకాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా తక్కువకే నటించేందుకు ఒప్పుకుంటుందట.అంతేకాదు తాను నటించిన సినిమాల ప్రమోషన్‌లో కూడా గ్లామరస్ ఔట్‌ఫిట్స్‌తో కనిపించి అందరిని ఆకట్టుకుంటుందనే మంచి టాక్‌ను ఈ బ్యూటీ సొంతంచేసుకుంది. ఈ ముద్దుగుమ్మకు ఒక మంచి హిట్ రావాలని మనమూ ఆశిద్దాం..

 సొంత కథ రాసుకుంటున్న దిల్ రాజు..?

సొంత కథ రాసుకుంటున్న దిల్ రాజు..?

స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు సొంత కథ రాసుకుంటున్నారా.. ఇందుకోసం ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేసిన ఈ డైనమిక్ ప్రొడ్యూసర్ ఇక తన సినిమాలపై మరింత ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా పరిశ్రమలో హీరోయిన్ల రెమ్యునిరేషన్, టికెట్ ధరలు, ఓటీటీ రిలీజ్‌లాంటి సమస్యలు తలెత్తడంతో వాటిపై దృష్టి సారించిన దిల్ రాజు ఇక నుంచి తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌పై దృష్టి సారిస్తున్నారు.

నాగచైతన్య-విక్రమ్ కుమార్ కాంబోలో వచ్చిన థాంక్యూ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ చిత్ర నిర్మాత అయిన దిల్ రాజు ఇక నుంచి తానే స్వయంగా కథపై ఫోకస్ చేయాలని భావించారట. ఇందుకోసం యంగ్ రైటర్స్‌ను కూడా ఒక బృందంగా ఏర్పాటు చేశారట. దిల్ రాజు ఆలోచనలను వీరు పేపర్ పై తమదైన శైలిలో పెడతారట.ఈ క్రమంలోనే దిల్ రాజు ఓ మంచి కథ అనుకున్నట్లు ఫిలింనగర్‌లో వార్త షికారు చేస్తోంది.ఈ కథలో కాంటెంపరరీ అంశాలతో పాటు మాంచి కమర్షియల్ కంటెంట్‌ కూడా ఉందని సమాచారం.

ఎంఎస్ రాజు లాంటి నిర్మాతలు ఇప్పుడు మెగాఫోన్ పట్టుకుని సినిమాలను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఈ మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా డైరెక్టర్‌గా ఎందుకు మారకూడదని పలువురు సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.అయితే ఇలాంటి సీనియర్ వ్యక్తులు ఓ ప్రయోగం చేస్తున్నప్పుడు ఈ నాటి యువతను దృష్టిలో పెట్టుకుని కథను అల్లితే బాక్సాఫీస్ వద్ద అది నిలబడే అవకాశాలుంటాయి. లేదంటే కథ కంచికే పోతుంది మరి.

ఈ స్టార్ హీరోల డైరెక్టర్లకు నో ఆఫర్స్

ఈ స్టార్ హీరోల డైరెక్టర్లకు నో ఆఫర్స్

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు తాము తీస్తున్న సినిమాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే నటుల ఎంపిక నుంచి, సినిమా బడ్జెట్ వరకు ప్రతి అంశంలోను వారు సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి కొందరైతే సినిమా కథ, కథనం, స్క్రీన్‌ప్లే వంటి అంశాల్లో వారి మార్క్‌ను చూపే ప్రయత్నం చేస్తున్నారు, చేశారు కూడా.వారి సలహాలతో ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టాయి.అయితే ఆ సినిమాలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్లకు మాత్రం ఈ హీరోలు శాపంగా మారారు. ఔనండి ఇది నిజం.

క్షణం, గూఢాచారి, మేజర్‌ చిత్రాల్లో నటించిన అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అడివి శేష్ అమెరికాలోని ఓ యూనివర్శిటీలో ఫిల్మ్‌ మేకింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిగ్రీ చేశాడు. అయితే తాను తన సినిమాలకు ఇచ్చే ఇన్‌పుట్స్‌ కచ్చితంగా వర్కౌట్ అవుతున్నాయి.. అదే సమయంలో బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్షణం సినిమా హిట్ అయ్యింది.. కానీ ఆ సినిమా తీసిన డైరెక్టర్ రవికాంత్ పేరెపు మాత్రం మరుగున పడ్డారు. తీసిన సినిమాలు బోల్తా కొట్టాయి ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.

ఇదే కోవలోకి సిద్ధు జొన్నలగడ్డ కూడా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన చిత్రాలకు తానే స్వయంగా కథ, డైలాగులు రాసుకుంటున్నారు. తన లేటెస్ట్ మూవీ డీజే టిల్లు బంపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే డీజే టిల్లు చిత్రం నిర్మాత విమల్ కృష్ణ మాత్రం సీక్వెల్ నుంచి వాకౌట్ చేశారట.ఇక మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా తన సినిమాలకు సొంతంగా స్క్రీన్ ప్లే ఇస్తున్నారు. నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ ఆత్రేయ చిత్రం హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ స్వరూప్ తీసిన తర్వాతి చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఇక ఇదే నవీన్ పోలిశెట్టి తీసిన జాతిరత్నాలు సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని అనుదీప్ డైరెక్ట్ చేశాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్రానికి నిర్మాత, రైటర్‌గా వ్యవహరించాడు అనుదీప్ . అయితే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యింది.

ఇలా ఈ హీరోలు ఇచ్చే ఇన్‌పుట్స్‌తో సినిమా హిట్ అవుతున్నప్పటికీ ఆ తర్వాత ఈ చిత్రాలను డైరెక్ట్‌ చేస్తున్న దర్శకులకు మాత్రం ఫ్యూచర్ సందిగ్ధంగా మారింది. అయితే ఈ కుర్ర హీరోల చిత్రాలను నిర్మించే నిర్మాతలు మాత్రం కంటెంట్ పై కూడా వీరు చూపించే ఫోకస్ పట్ల హ్యాపీగా ఉన్నారట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+