టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

దేశవ్యాప్తంగా టమాట ధర మండిపోతుంది. విపరీతంగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులకు టమాటా మంట పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క టమాట ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు లబోదిబోమనేలా చేస్తున్నాయి.

వర్షాలు, వరదల కారణంగా టమాటా పంటకు దెబ్బ .. భారీగా పెరిగిన ధరలు

వర్షాలు, వరదల కారణంగా టమాటా పంటకు దెబ్బ .. భారీగా పెరిగిన ధరలు

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న విపరీతమైన వర్షాలు, వరదలు కూడా టమాట ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. వారం రోజుల క్రితం వరకు రాష్ట్రంలో కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయించగా, ఆదివారం మాత్రం అసాధారణంగా రూ.120కి చేరడంతో.. ధర ఆల్ టైమ్ హై రికార్డుకు చేరుకుందని చెప్పవచ్చు. ఆదివారం నందికొట్కూరు మార్కెట్‌లో కిలో టమాట రూ.120కి విక్రయించారు. రోజురోజుకు టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం మినహా టమాటా ఉత్పత్తిలో కర్నూలు జిల్లా మూడో స్థానంలో ఉంది.

చిత్తూరు, అనంతపురం టమాటాకు వరదల ఎఫెక్ట్ , కర్నూల్ టమాటాకు గిరాకీ

చిత్తూరు, అనంతపురం టమాటాకు వరదల ఎఫెక్ట్ , కర్నూల్ టమాటాకు గిరాకీ

కర్నూలులో పత్తికొండ, మద్దికెర, పీపల్లీ‌, ఆస్పరి, ఆలూరు, దేవనకొండ, ధోనే, కోడుమూరు మండలాల్లో టమాట సాగు చేస్తున్నారు. ఈ మండలాల్లో 15,000 నుంచి 16,000 హెక్టార్లలో పంట సాగైంది. మూడు నెలల క్రితం కనీసం కనీస మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో గిట్టుబాటు ధర లేక పలు సందర్భాల్లో రైతులు టమోటాలను రోడ్లపై పారబోశారు.

అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో పరిస్థితి తారుమారైంది. భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం జిల్లాల్లో సాగు చేసిన టమోటా పంట పూర్తిగా దెబ్బతిన్నది. కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాల ప్రభావం తక్కువగా ఉండడంతో జిల్లాలో సాగు చేసిన టమోటాలకు వ్యవసాయ మార్కెట్‌లో మంచి గిరాకీ వస్తోంది.

ధరల పెరుగుదలతో సబ్సిడీ టమాటాలు ఇవ్వాలంటున్న సామాన్యులు

ధరల పెరుగుదలతో సబ్సిడీ టమాటాలు ఇవ్వాలంటున్న సామాన్యులు

కర్నూల్ జిల్లాలో పండిన పంటకు అనూహ్యమైన ధర లభించడంతో రైతులు పండగను జరుపుకుంటున్నారు. ధరలు రైతుల ముఖాల్లో సంతోషాన్ని నింపుతున్నా, మరోవైపు సామాన్యులకు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.ముఖ్యంగా ఆడవాళ్లకు వంటల్లో టమాటాలు లేకుంటే ఆ ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చాలా మంది టమోటాలకు బదులుగా చింతపండును ఉపయోగిస్తున్నారు.

రైతుబజార్లలో ప్రభుత్వం సబ్సిడీపై టమోటాలు సరఫరా చేయాలని తెలుగు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందంటే టమాట ధర ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిని సరఫరా చేసేదని ఇప్పుడు అలా టమాటాలు సరఫరా చెయ్యాలని అంటున్నారు.

మదనపల్లి టమాటాకు డిమాండ్ .. వర్షాలతో రవాణా లేక తెలంగాణాలో టమాటా మంట

మదనపల్లి టమాటాకు డిమాండ్ .. వర్షాలతో రవాణా లేక తెలంగాణాలో టమాటా మంట

మదనపల్లి, అనంతపురం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో కర్నూలు జిల్లాలో టమోటాలకు డిమాండ్‌ పెరిగిందని ఉద్యానవనశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీహెచ్‌) బీవీ రమణ తెలిపారు. రైతులు పండించిన పంటలకు ఇంత ఎక్కువ ధర లభించడం ఇదే తొలిసారి. అయితే టమోటా రైతులు పండించిన పంటకు నమ్మశక్యం కాని ధర లభించడం పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారని సమాచారం.

ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్రంలోనూ టమాటా ధరలు చుక్కలను చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా తెలంగాణలో టమోటా ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని టమాటాలకు ఫేమస్ అయిన మదనపల్లి నుండి అత్యంత డిమాండ్ ఉన్న కూరగాయల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లోనూ ధరలు అకస్మాత్తుగా పెరిగాయి . కేవలం 1 కిలో టమాటా కోసం, రూ. 100 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కరీంనగర్ మార్కెట్ కు మదనపల్లె టమాటా .. మార్కెట్ లో చుక్కల్లో టమాటా ధరలు

కరీంనగర్ మార్కెట్ కు మదనపల్లె టమాటా .. మార్కెట్ లో చుక్కల్లో టమాటా ధరలు

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె కరీంనగర్‌కు గణనీయమైన స్థాయిలో టమోటాలను సరఫరా చేస్తుంది, అయితే ఈ ప్రాంతంలో వరదలు విధ్వంసం సృష్టించడంతో నిల్వల రాక గణనీయంగా పడిపోయింది. దీంతో మదనపల్లె నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొద్దిపాటి లోడ్‌ల టమోటాలు మాత్రమే వస్తున్నాయి. దీంతో కరీంనగర్ మార్కెట్ లో ధరలు పెరిగాయి.

25 కిలోల బాక్సును రూ.2,300 ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. రవాణా ఛార్జీలు కలిపితే మనం టమాట మార్కెట్ లో కొనుగోలు చేసే ధర కిలో రూ.96 అని ఎంతకు అమ్మాలో తెలియటం లేదని వారు వాపోతున్నారు. ఎక్కువ ధరకు టమాట కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడకపోవడమే వ్యాపారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కరీంనగర్‌లో కిలోకు రూ.100 చొప్పున టమాట విక్రయిస్తున్నారు. ఇంత ఎక్కువ ధరలకు కూరగాయలు కొనేందుకు వినియోగదారులు వెనుకాడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ వరదలకు ముందు జిల్లాలో టమాట కిలో రూ.30కి విక్రయించేవారని సమాచారం.

దేశ వ్యాప్తంగా ధరల మంట ఇలాగే ... టమాటా ధరల తగ్గుదల కోసం ఎదురు చూస్తున్న సామాన్యులు

దేశ వ్యాప్తంగా ధరల మంట ఇలాగే ... టమాటా ధరల తగ్గుదల కోసం ఎదురు చూస్తున్న సామాన్యులు

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కూడా టమాటా ధరల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ సారి వర్షాలు, వరదల కారణంగా దిగుబడి సరిగా రాకపోవటంతో తీవ్ర,మైన టమాటా కొరత ఇప్పుడు దేశాన్ని వేధిస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా టమాటాలకు ఇబ్బంది ఉంది. టమాటాలకు అతిపెద్ద మార్కెట్ అయిన కోలార్ లో కూడా టమాటా ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. 15 కిలోల టమాటాల బాక్స్ వెయ్యి రూపాయలకు పైగా పలుకుతుంది. కూరగాయలలోనే అత్యధిక వినియోగం ఉండే టమాటా ధరలు చుక్కల్లో ఉండటంతో ధరలను తగ్గించాలని ప్రభుత్వాలకు సామాన్య ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+