Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణాలో దంచికొడుతున్న వర్షాలు; 13జిల్లాలకు రెడ్ అలెర్ట్; ప్రమాదకరంగా గోదావరి; తాజా సమాచారమిదే!!

తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణపై వరుణుడి ప్రతాపంతో వరుసగా నాలుగో రోజు కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. శని, ఆదివారాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో చెరువులు, కుంటలు నిండుకున్నాయి. ఆదివారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగుతూ రహదారులు నీట మునగడంతో చాలాచోట్ల అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

వర్షాల ఎఫెక్ట్ .. తెలంగాణా వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్

వర్షాల ఎఫెక్ట్ .. తెలంగాణా వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్


ఇదిలా ఉంటే భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి వరద పోటెత్తడంతో, ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు రాత్రి 7 గంటల ప్రాంతంలో తొమ్మిది స్పిల్ వే గేట్లను ఎత్తివేసి వరద నీటి విడుదలను చేపట్టారు. రానున్న మూడు, నాలుగు రోజులపాటు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే సూచనతో రాష్ట్ర ప్రభుత్వం జూలై 11 నుంచి 13 వరకు అన్ని విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయి వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

భారీ వర్షాలతో సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం

భారీ వర్షాలతో సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం

భారీ వర్షాల నేపథ్యంలో, అన్ని జిల్లాల యంత్రాంగాలు వరద ప్రభావాన్ని అంచనా వేయడంలో, వరద సహాయక చర్యలలో మునిగిపోయాయి. అన్ని జిల్లాల అధికారులు సోమవారం ఫిర్యాదుల పరిష్కార దినమైన ప్రజావాణిని తాత్కాలికంగా నిలిపివేశారు. తద్వారా అధికారులు అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏదైనా అత్యవసర పరిస్థితికి హాజరయ్యేలా తమ ప్రధాన కార్యాలయంలోనే ఉండాలని అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు.

 భారీ వర్షపాతం నమోదైన ప్రాంతాల వివరాలివే

భారీ వర్షపాతం నమోదైన ప్రాంతాల వివరాలివే

ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొల్లూరులో 181 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నీల్వాయి లో 161 మిల్లీ మీటర్ల వర్షపాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెం లో 161 మిల్లీమీటర్ల వర్షపాతం, కొత్తపల్లి లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం మరో 12 చోట్ల అదే సమయంలో 100 మి.మీ నుంచి 148 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది.

జగిత్యాల మరియు ధర్మపురి మధ్య నిలిచిన రాకపోకలు

జగిత్యాల మరియు ధర్మపురి మధ్య నిలిచిన రాకపోకలు

అనంతారం వద్ద వంతెనపై వరద నీరు ప్రవహించడంతో జగిత్యాల మరియు ధర్మపురి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శాత్రాజుపల్లి వద్ద సిరిసిల్ల బైపాస్‌ రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వారు కరీంనగర్‌ మీదుగా వెళ్లాలని సూచించారు. ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షాలు కురవగా, హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుశాయి. ఇక పది ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురవగా, 56 ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసినట్లు సమాచారం. మొత్తం 426 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసినట్లుగా తెలుస్తుంది.

మరో మూడు రోజులు భారీ వర్షాలకు ఛాన్స్

మరో మూడు రోజులు భారీ వర్షాలకు ఛాన్స్


సోమవారం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది . ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో దంచికొడుతున్న వానలతో చెరువులన్నీ నిండి మత్తడి పోస్తున్నాయి. ఇప్పటికే 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు తాజా వర్షాల నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జాబితాను మరింత పెంచారు.

13 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

13 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

మొత్తం 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు.

గోదావరిలో పోటెత్తుతున్న వరద .. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరిలో పోటెత్తుతున్న వరద .. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మరో మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే అటు గోదావరి నదిలో నీటి మట్టం ప్రమాదకరంగా మారింది. భద్రాచలం దగ్గర 43అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద, పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా నీటి మట్టం అంతకంతకూ పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+