తెలంగాణ బీజేపి అధ్యక్షుడికి తీవ్రపోటి.. ఆశావాహుల జాబితాలో హేమాహేమీలు!

రాబోయే ఎన్నికలో తెలంగాణ రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తాము ఇది బీజేపీ అగ్రనాయకులే కాదు ద్వితీయ స్థాయి నాయకులలోనూ వినిపిస్తున్న మాట. జాతీయ నాయకత్వం కూడా తెలంగాణా రాష్ట్రంలో అధికార పార్టీకి తమ పార్టీనే ప్రత్యామ్నాయం కావాలని, ఆ దిశగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక చెయ్యాలని భావించి, ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నా, ఇంకా వెల్లడి చేయకపోవటంతో ఆశావహుల జాబితా పెరిగిపోతుంది.

బీజేపీ తెలంగాణా కొత్త అధ్యక్షుడి ప్రకటన కోసం భేటీ
ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్న దానిపై బీజేపీ అధినాయకత్వం వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్టానికి చెందిన ఎనిమిది మంది ఎంపీ లు, ఎమ్మెల్యేలతో గత నెలలో డిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో, అలాగే జాతీయ హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారని, ప్రకటన చేస్తారని బీజేపీ క్యాడర్ భావించింది.

Tough competition for Telangana BJP president Growing list of aspirants

బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఆలోచన
బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఈ సారి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి అని బలంగా వినిపిస్తున్న క్రమంలో తెర మీదకు రోజుకో కొత్త పేర్లు వస్తున్న పరిస్థితి ఉంది. బీసీలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న క్రమంలో ఆశావహుల జాబితా పెరిగిపోతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో పోటీ నిలిపి, అన్ని స్థానాలను గెలుచుకోవాలనే ఆలోచనలో ఉంది.

బీసీ నినాదంతో అన్ని పార్టీలు
ఇదే సమయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమైంది కాబట్టి తెలంగాణాలో బీజేపీని ప్రజలకు ప్రత్యామ్నాయంగా చూపించాలని భావిస్తుంది. ఇక తెలంగాణలో బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలి బీసీలను తమవైపే తిప్పుకోవాలి అని అన్ని పార్టీల వాళ్ళు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి పీ సి సి గా మహేష్ గౌడ్ కి అవకాశం కల్పించింది.

బీజేపీ బీసీ రథ సారధి ఎంపిక వెనుక
ఎన్నికల హామీలో బాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం వాట కల్పిస్తామని చెబుతుంది . మరి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలి అంటే బీజేపీ రథ సారధిగా బీసీకి అవకాశం ఇచ్చి బీసీ ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.

బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో జోష్
ఇక బీజేపీ తెలంగాణా రథసారధిగా బండి సంజయ్ పని చేసిన సమయంలో పార్టీ దూకుడు చూపించింది. బండి సంజయ్ ను మార్చకుండా ఉంటే తెలంగాణా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అప్పుడు ప్రత్యామ్నాయంగా బీజేపీనే కనిపించి ఉండేది అన్నది తెలంగాణా రాష్ట్రంలో అందరూ ప్రధానంగా చర్చించిన అంశం. బండి సంజయ్ ను మార్చటమే పార్టీకి చేటు చేసిందని భావించిన వారు కూడా లేకపోలేదు.

పోటీలో బండి సంజయ్, ఈటల రాజేందర్
బండి సంజయ్ ను మార్చటం వల్లే అనూహ్యంగా కాంగ్రెస్ పేరు తెరమీదకు వచ్చిందని, ఫలితంగా తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ అధికారం పోగొట్టుకుందని భావించిన వారు కూడా లేకపోలేదు. ఇక ప్రస్తుతం కూడా బండి సంజయ్ కు అవకాశం ఇస్తే మళ్ళీ బీజేపీ దూకుడు చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. బండి సంజయ్ ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న క్రమంలో బీసీల నుండి ఈటల రాజేందర్ కు అవకాశం ఇచ్చినా బీజేపీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు
ఇక బీసీల పేరే వినిపిస్తున్న క్రమంలో డీకే అరుణ,రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, పేరాల శేఖర్ ఇలా చాలా మంది సీనియర్ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఎవరికి వారు తమకు అవకాశం కావాలని కోరుతున్నట్టు సమాచారం. బీసీ సామాజిక వర్గాలవారిగా అవకాశం వస్తె ప్రభుత్వాన్ని ఎండగడతా అని ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. ఇక ఆశావహులు అందరూ ఎవరికి వారు తాము ఏమి చెయ్యగలమో చెప్తున్నారు.

అధ్యక్షుడి ప్రకటన జాప్యానికి కారణం ఎమ్మెల్సీ పలితాలేనా
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉపాద్యాయ,పట్టభద్రుల ఎన్నికలో బీజేపీ రెండు చోట్ల విజయం సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో నయాజోష్ మొదలైంది . ఇకనుండి ఏ ఎన్నికలు వచ్చిన బీజేపీనే గెలుస్తుంది అనే నమ్మకంతో ఉన్న బీజేపీ నాయకత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని పార్టీ సంఘటన కార్యదర్శి చంద్ర శేఖర్ తివారి సూచించారు.

తెలంగాణా రాష్ట్ర కొత్త అధ్యక్షుడిపైన తెలంగాణా భవిష్యత్ రాజకీయం
ఇక అధ్యక్షుడి ఎంపిక విషయంలో భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆచి తూచి అడుగులు వేస్తున్న బీజేపీ అధినాయకత్వం అధ్యక్షుడిగా ఎవరి పేరు ప్రకటిస్తుంది అనేది మాత్రం అందరిలో ఉత్కంఠ రేకెత్తించే అంశం. ఇక పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడుగా అధిష్టానం పట్టం కట్టే లీడర్ ను బట్టే తెలంగాణా రాష్ట్ర బీజేపీ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+