"నేను స్పందించేంత స్థాయి కేటీఆర్ ది కాదు"
తాను స్పదించే అంత స్థాయి కేటీఆర్ ది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయని.. జూబ్లీహిల్స్ సీట్ గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు 10 మంది సమర్థులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డీసీసీల కమిటీ కోసమే సీనియర్ నాయకులను ఇంఛార్జ్ లుగా నియమించామని అన్నారు.
జూబ్లీహిల్స్ సీట్ గెలుస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు 10 మంది సమర్థులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎక్కడ భై ఎలక్షన్లు వచ్చినా తాము రెడీగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాను స్పదించే అంత స్థాయి కేటీఆర్ ది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఎద్దేవా చేశారు.
"ఈనెల 15 తేదీలోగా కొత్త డీసీసీ కమిటీలు ఏర్పాటు చేస్తాం. డీసీసీల కమిటీ కోసమే సీనియర్ ఇంఛార్జ్ లను ఏర్పాటు చేశారు. డీసీసీల కమిటీ ప్రక్రియ పూర్తి అయ్యాక త్వరలో డీసీసీ అధ్యక్షుల నియామకం ఉంటుంది. ఏఐసీసీ అబ్జర్వర్లు త్వరలో రాష్ట్రానికి వస్తారు. ఈ నెల చివరి వరకు అన్ని కమిటీలు పూర్తి అవుతాయి. యూరియా సప్లై పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని మా ఆలోచన" అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ అన్నారు.

"అనిరుద్ రెడ్డి అంశంలో మల్లు రవి విచారణ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న కులగణ పత్రాలు తగులబెట్టారని చర్యలు తీసుకున్నారు. తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ వేరు అనిరుద్ అంశం వేరు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అందుకే నిరసనలు చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లైవ్ లోనే ఉంది. మహిళల సీట్లు పెరుగుతాయి. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. మంత్రి పదవుల అంశం నా పరిధిలో లేదు. రాజకీయాల్లో ఒక్కో సారి జూనియర్ లకు ముందు అవకాశాలు వస్తాయి. సీనియర్లను సైతం పార్టీలు గుర్తిస్తాయి. ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చిన మేము రెడీ.." అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
"జూబ్లీ హిల్స్ బై ఎన్నికలో మేము గెలుస్తున్నాం. సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయి. జూబ్లీహిల్స్ సీట్ గెలుస్తున్నాం. జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు 10 మంది సమర్థులు సిద్ధంగా ఉన్నారు. వేరే పార్టీ నుండి ఎందుకు అభ్యర్థి ని తీసుకుంటాం? నిర్బంధ పాలన కేసీఆర్ ది. ఆనాడు నెలలో 15 హౌజ్ అరెస్టులు జరిగేవి. మా హయాంలో నిర్బంధాలు లేవు అందుకే కవిత ధర్నాలు చేస్తుంది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అవినీతిపై మాట్లాడితే అరెస్ట్ లు చేశారు. కాళేశ్వరం వద్దకు వెళ్దాం అనుకుంటే నిర్బంధించారు. నన్ను బొల్లారం పోలీస్ స్టేషన్ లో సాయంత్రం వరకు ఉంచారు. ఎక్కడబడితే అక్కడ అరెస్టు లు ఉండేవి.." అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.












Click it and Unblock the Notifications