తెలంగాణ ద్రోహి మోదీ.. బంగాళఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకో : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజనపై మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశ ప్రధానిగా అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆథమ స్థాయిలో మాట్లాడినట్లు ఉందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

తెలంగాణ జాతిని అవమానపరిచారు..
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టారు. మైకులు ఆపేసి చర్చ లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఏపీని విభజించిందని వ్యాఖ్యానించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రధాని మోదీపై తెలంగాణ జాతిని అవమాన పరిచారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని దిష్టిబొమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి...
రాజకీయ లబ్దికోసం ప్రధాని మోదీ దిగజారి మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రజా ఉద్యమాల ద్వారా మోదీ ఎదగలేదని.. మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారని నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని భ్రష్టు పట్టించింది మోదీయేనని మండిపడ్డారు. బంగాళఖాతంతో దూకి ప్రదాని ఆత్మహత్య చేసుకోవాలని మండిపడ్డారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణ ద్రోహి.. మోదీ అని నిరూపితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అద్వానీని మోసం చేసిన ఘనత మోదీదే..
రాజకీయ గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని రేవంత్ విమర్శించారు. చదువు సంధ్య లేని వ్యక్తి ప్రధానిగా మోదీ అవటం మన దురదృష్టకరమని రేవంత్ చురకలు అంటించారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ 1997లో కాకినాడ తీర్మానం చేసింది బీజేపీయేనని ఆయన గుర్తు చేశారు. గతంలో చట్టంలో లేకపోయినా నమ్మకం కలిగించేలే ప్రధానుల ప్రసంగాలు, వ్యాఖ్యలు ఉండేవి. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ అత్యున్నత స్థాయిలో ఉన్నామన్నదే మరచి ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు.
-
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications